ఆరియానా క్యారెక్టర్‌పై రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్: బిగ్ బాస్‌ షోపై ఊహించని విధంగా!

బిగ్ బాస్ షో బుల్లితెరపై ఎన్ని రికార్డులకు క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో ఎంతో మంది చోటా మోటా ఆర్టిస్టులను సెలెబ్రిటీలుగా మార్చేస్తోంది. అందుకే ఈ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇలా.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే అద్భుతమైన రీతిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న వారిలో యాంకర్ ఆరియానా గ్లోరీ ఒకరు. అసాధారణమైన ఆటతో ఫినాలే వరకూ చేరిన ఆమె క్యారెక్టర్‌పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

యాంకర్‌గా ఆరియానా సూపర్ సక్సెస్

యాంకర్‌గా ఆరియానా సూపర్ సక్సెస్

చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కెరీర్‌ను ఆరంభించింది ఆరియానా గ్లోరీ అలియాస్ అర్చన. ఆ తర్వాత మీడియా రంగంలోకి అడుగు పెట్టిన ఆమె.. యూట్యూబ్ ఛానెళ్లలో యాంకర్‌గా పని చేసింది. ఈ క్రమంలోనే ప్రత్యేకమైన మేజరిజంతో గుర్తింపు దక్కించుకుంది. తద్వారా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది.

రాంగోపాల్ వర్మ దెబ్బకు ఫుల్ ఫేమస్

రాంగోపాల్ వర్మ దెబ్బకు ఫుల్ ఫేమస్

గతంలో రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది ఆరియానా. ఆ సమయంలో ‘మీకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన అమ్మాయి ఎవరు' అని ఆమె ప్రశ్నించగా.. ఆయన వెంటనే ‘నువ్వే' అని రిప్లై ఇచ్చాడు. అంతేకాదు, ఈ వీడియోను స్వయంగా ఆర్జీవీనే ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఆరియానా ఫేమస్ అయిపోయింది. ఈ గుర్తింపుతోనే బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం పొందింది.

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ... ట్రాకు.. ఫైటుతో

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ... ట్రాకు.. ఫైటుతో

తనను తాను బోల్డ్ అని చెప్పుకుంటూ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆరియానా గ్లోరీ. హౌస్‌లోకి ప్రవేశించినప్పటి నుంచే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ప్రతి టాస్కులో ఫైటింగ్ చేస్తూ ఫినాలేకు చేరుకుంది. ఇక, జబర్ధస్త్ ఫేమ్ ముక్కు అవినాష్‌తో ట్రాకు నడిపి మరింత హాట్ టాపిక్ అయింది. ఇలా ఆమె ఆద్యంతం ఆకట్టుకుంటూ మంచి పేరు తెచ్చుకుంది.

ఆరియానాకు ఓట్ చేయమన్న ఆర్జీవీ

ఆరియానాకు ఓట్ చేయమన్న ఆర్జీవీ

అసలు బిగ్ బాస్ షో అంటేనే తెలియదు అని చెప్పిన దర్శకుడు రాంగోపాల్ వర్మ... అందులో కంటెస్టెంట్‌గా ఉన్న ఆరియానా గ్లోరీకి మద్దతుగా తాజాగా ఓ ట్వీట్ చేశారు. ‘అందరూ ఓట్ చేసి ఆరియానాను గెలిపించండి. ఈమె మాత్రమే బిగ్ బాస్‌లో గెలవడానికి అర్హురాలు' అంటూ అందులో పేర్కొన్నారాయన. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసేస్తుంది.

ఆరియానాపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

ఆరియానాపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

తాజాగా రాంగోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆరియానా క్యారెక్టర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఆమెను మొదటిసారి కలిసినప్పుడే బోల్డ్ లేడీ అని అర్థం అయింది. ఆమె సిగ్గు పడకుండా ప్రశ్నలు అడిగితే నేనే ఆశ్చర్యపోయా. బిగ్ బాస్‌లోనూ అలాగే ఆడుతోంది. ఆమె గెలవాలని కోరకుంటున్నా' అంటూ ఆ యాంకర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

బిగ్ బాస్‌ షో పైనా ఊహించని విధంగా

బిగ్ బాస్‌ షో పైనా ఊహించని విధంగా

ఆ మధ్య జరిగిన కొన్ని ఇంటర్వ్యూల్లో ‘బిగ్ బాస్ అంటే ఏంటి? అది షోనా లేకపోతే ఏమైనానా? హిందీలో అప్పుడెప్పుడో ఎవరో అంటే విన్నాను. ఇది తెలుగులో కూడా మొదలైందా.? అసలు దాని గురించి నాకు కొంచెం కూడా తెలీదు. నేనెప్పుడూ చూడలేదు కూడా' అంటూ షాకింగ్ రియాక్షన్స్ ఇచ్చిన వర్మ.. ఊహించని విధంగా ఇప్పుడు ఆరియానా కోసం ఆ చూశానని చెప్పడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X