Bigg Boss Telugu 8: డేంజర్‌ జోన్‌లో టాప్ కంటెస్టెంట్.. రంగంలోకి రాంగోపాల్ వర్మ.. తొలిసారి ఆ ఫొటో వదిలి!

టాలీవుడ్‌ నుంచి దర్శకుడిగా పరిచయమై.. దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్న వారిలో రాంగోపాల్ వర్మ ఒకడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో పెట్టుకున్న సరిహద్దులను తన సినిమాలతో చెరిపేసిన ఆయన.. ప్రత్యేకమైన ఇమేజ్‌తో బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. దీంతో దిగ్గజ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఇప్పుడీ దర్శకుడు తన పంథాను పూర్తిగా మార్చుకుని చిత్ర విచిత్రమైన సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోను కూడా చూస్తున్నాడు. ఇలా ఇప్పుడు ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేస్తున్నాడు. ఆ వివరాలు మీకోసమే!

బిగ్ బాస్ షోపై వర్మ విమర్శలు
బిగ్ బాస్ షోపై గతంలో రాంగోపాల్ వర్మ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'బిగ్ బాస్ అంటే ఏంటి? అది షోనా లేకపోతే ఏమైనానా? హిందీలో అప్పుడెప్పుడో ఎవరో అంటే విన్నాను. ఇది తెలుగులో కూడా మొదలైందా.? అసలు దాని గురించి నాకు కొంచెం కూడా తెలీదు. నేనెప్పుడూ చూడలేదు కూడా' అంటూ చెప్పుకొచ్చాడు.

Ram Gopal Varma Supports Bigg Boss Telugu 8 Contestant Sonia Akula

ఆమెకు మద్దతు.. షో చూస్తాను

గతంలో అసలు బిగ్ బాస్ షో అంటేనే తెలియదు అని చెప్పిన దర్శకుడు రాంగోపాల్ వర్మ... నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న ఆరియానా గ్లోరీకి మద్దతుగా ఓ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్‌గా వచ్చిన శ్రీ రాపాకకు కూడా అతడు సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేశాడు. అప్పటి నుంచి రాంగోపాల్ వర్మ కూడా షో చూస్తున్నానని పలుమార్లు చెప్పాడు.

ఎనిమిదో సీజన్‌లో ఆమెపైనా
బిగ్ బాస్ షో అంటే తెలియదు అన్న రాంగోపాల్ వర్మ.. ఈ మధ్య కాలంలో ప్రతి సీజన్‌లోనూ ఏదో ఒక కంటెస్టెంట్‌కు మద్దతు తెలుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంటరైన తెలుగు అమ్మాయి సోనియా ఆకులకు వర్మ సపోర్ట్ చేస్తున్నాడు. ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనే అతడు ఓ వీడియోను పంపించాడు.

Ram Gopal Varma Supports Bigg Boss Telugu 8 Contestant Sonia Akula

డేంజర్ జోన్‌లోనే సోనియా

ఎనిమిదో సీజన్‌లోకి 14 మంది సెలెబ్రిటీలు వచ్చారు. అందులో తెలుగు పిల్ల సోనియా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు తగ్గట్లుగానే హౌస్‌లోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ముందుకు సాగుతోంది. కానీ, తన చెత్త ప్రవర్తనతో తరచూ విమర్శలను ఎదుర్కొంటోంది. అలా ఇప్పుడు నాలుగో వారంలో తక్కువ ఓట్లతో ఎలిమినేషన్‌ ప్రమాదంలో పడిపోయింది.

రంగంలోకి దిగిన దర్శకుడు
ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చిన సోనియా ఆకుల.. నిత్యం పృథ్వీరాజ్, నిఖిల్ పక్కనే ఉంటోంది. దీంతో ఆమెకు చెడ్డపేరు వచ్చి ఈ వారం ఓటింగ్‌లో బాగా వెనుకబడింది. దీంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ రంగంలోకి దిగాడు. ఈ మేరకు ఆమె ఫొటోతో పాటు బిగ్ బాస్‌లో ఆమెకు కేటాయించిన నెంబర్‌ను షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నాడు.

మీ ప్రేమను చూపించండి

రాంగోపాల్ వర్మ తన X (ట్విట్టర్) ఖాతాలో 'సోనియా ఆకుల అనే అమ్మాయి బలం, యాటిట్యూడ్‌కు నిదర్శనం. బిగ్ బాస్‌లో చాలా బాగా ఆడుతుంది. ప్రతి రోజు ఒకసారి మిస్డ్ కాల్ ద్వారా, ఒకసారి హాట్‌స్టార్ ద్వారా ఓటు వేసి సోనియాకు మీ ప్రేమను చూపించండి' అంటూ పోస్ట్ చేశాడు. అలాగే, ఆమెతో దిగిన ఫొటోను సైతం తొలిసారి షేర్ చేసి సర్‌ప్రైజ్ చేసేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X