Ram Pothineni ది వారియర్ మూవీ ఫస్ట్ టైమ్ టీఆర్పీ.. రీసెంట్ టైమ్ లో బెస్ట్ రికార్డ్!
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఎలాంటి సినిమా చేసినా కూడా విభిన్నమైన తరహాలో ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక ఇటీవల అతని నుంచి వచ్చిన మాస్ కమర్షియల్ హై వోల్టేజ్ మూవీ ది వారియర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాకు మొదట పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తిస్థాయిలో కలెక్షన్స్ అందుకోలేకపోయింది. ఏదేమైనప్పటికీ అందులో రామ్ నటించిన విధానం మాత్రం ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అంతేకాకుండా ఓటీటీలో విడుదలైనప్పుడు కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి నటించిన విషయం తెలిసిందే. ఇక మొదటిసారి ఇటీవల స్టార్ మా లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఇక మొదటి శాటిలైట్ ప్రదర్శనలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఒక విధంగా ఇటీవల కాలంలో పలువురు అగ్ర హీరోలు కూడా ఈ తరహాలో రేటింగ్ అందుకోలేకపోయారు.

ఇక రామ్ పోతినేని ది వారియర్ సినిమా ఫస్ట్ టెలిక్యాస్ట్ అయినప్పుడు 10.02 టీఆర్పీని అందుకుంది. రామ్ నటించిన ప్రతి సినిమాకు కూడా టెలివిజన్లో అయితే మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అలాగే యూట్యూబ్ లో కూడా అతని హిందీ డబ్బింగ్ సినిమాలకు మిలియన్ల వ్యూవ్స్ ఉన్నాయి. ఇక ది వారియల్ సినిమా కూడా టెలివిజన్లో అయితే మంచి రెస్పాన్స్ దొరికింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగస్వామి తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇక రామ్ పోతునేని తన తదుపరి సినిమాను మాస్ కమర్షియల్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టుగా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











