సుడిగాలి సుధీర్, శ్రీను మిస్సింగ్ పై అనీల్ రావిపూడి కామెంట్స్.. రామ్ ప్రసాద్ ఎమోషనల్
తెలుగులో జబర్దస్త్ షో తెచ్చుకున్నంత క్రేజ్ మరో షో తెచ్చుకోలేదు అని చెప్పక తప్పదు. ఎప్పుడో ప్రారంభమైన ఈ షో ఇప్పటికే అనేక ఎపిసోడ్స్ పూర్తయినా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా దూసుకుపోతూనే ఉంది. ఎంత మంది కమెడియన్లు వచ్చి పోతున్నా, జడ్జ్ లు వచ్చి పోతున్నా షోకి మాత్రం డోకా లేదు. ఇక ఈ షో ద్వారా పేరు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. సుధీర్ తో పాటుగా ఆయన స్నేహితులు రాంప్రసాద్, గెటప్ శ్రీను కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు వీరి టీమ్ విడివిడిగా కనిపిస్తోంది. ఈ విషయం మీద రామ్ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే ..

ముగ్గురు ఉన్నారంటే
సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్‌ల కాంబో ఒక అల్టిమేట్ కాంబో అనే చెప్పచ్చు. ఈ ముగ్గురు తమ వైవిధ్యమైన స్కిట్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ ముగ్గురు కలిసి స్కిట్ చేసి అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే వీరి స్కిట్లలో మ్యాటర్ లేకున్నా, వీరు ముగ్గురు ఉన్నారంటే, ఆ స్కిట్‌లో ఫన్ జెనరేట్ అయ్యేది.

కొద్ది రోజుల నుంచి
అయితే ఇప్పుడు షో నుంచి సుడిగాలి సుధీర్ బయటకు వచ్చేశాడన్న వార్తలు ఈ మధ్య పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. దానికి తోడు ఆ వార్తలకు ఊతం ఇచ్చే విధంగా గత కొద్ది రోజుల నుంచి సుడిగాలి సుధీర్ ఎక్స్ట్రా జబర్థస్త్‌లో కనిపించటం లేదు. ప్రస్తుతం గెటప్ శ్రీను కూడా షోలో కనపడక పోవడంతో ఇక ఆయన కూడా బయటకు వచ్చేశాడన్న ప్రచారం జరుగుతోంది.

అనిల్ రావిపూడితో
ఇప్పుడు ఆటో రామ్ ప్రసాద్ మాత్రమే షోలో మిగిలిపోయాడు. ఒక్కడే స్కిట్లు చేస్తూ ఏదోలా నెట్టుకు వస్తున్నాడు కానీ ముగ్గురూ ఉన్నప్పటి మ్యాజిక్ మాత్రం రిపీట్ కావడం లేదు అని చెప్పాలి. ఇదే విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి రామ్ ప్రసాద్ ను అడిగారు. ''ఎఫ్ 3'' ప్రమోషన్లలో భాగంగా ఎక్స్ట్రా బబర్థస్త్‌కు వచ్చిన అనిల్ రావిపూడితో ఆటో రామ్ ప్రసాద్ ఒక స్కిట్ చేశారు.

మ్యాజిక్ జరిగిపోతుంది
అది పూర్తయిన తరువాత, ' నీ పేరే ఆటో కదా?.. ఫస్ట్ టైం అనుకుంటా నీ వీల్స్ లేకుండా నువ్వో స్కిట్ చేస్తున్నావ్. ఎలా ఫీలవుతున్నావు వాళ్లిద్దరూ లేకుండా?..'' అని ప్రశ్నించారు. దీంతో ఆ ప్రశ్నకు రామ్ ప్రసాద్ సమాధానం ఇస్తూ వాళ్లిద్దరూ ఉన్నారనుకోండి.. ఆ కోఆర్డినేషన్ వేరు. ఒరే బావ! నీ డైలాగ్ అది. నీ డైలాగ్ ఇది.. అని అంటే.. మాకు తెలియకుండా ఆ మ్యాజిక్ జరిగిపోతుంది మా ముగ్గురి మధ్యలో.. అలాంటిది ఆ ఇద్దరు లేకపోవటంతో..'' అంటూ ఎమోషనల్ అయినట్టు తాజా ప్రోమోలో చూపించారు.

ఏమన్నా చెబుతారేమో?
అయితే వారు ఎందుకు లేరు అన్న విషయం మాత్రం చూపలేదు. బహుశా దాన్ని ఫుల్ ఎపిసోడ్ లో చూపించే అవకాశం కనిపిస్తోంది. చూడాలి సుధీర్ వ్యవహారం గురించి రామ్ ప్రసాద్ ఏమన్నా చెబుతారేమో?


Click it and Unblock the Notifications











