twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బుల్లితెరపై మళ్లీ ‘రామాయణం’

    By Bojja Kumar
    |

    భారతీయ టీవీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన 'రామాయణ్' పౌరాణిక సీరియల్ మరోసారి బుల్లితెరపై కనువిందు చేయనుంది. భారతీయ సంస్కృతిలో మమేకమైన శ్రీరామచంద్రుని దివ్యగాథను మరోమారు తెరకెక్కించనున్నట్లు ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జీటీవీ ప్రకటించింది.

    Ramayan

    ఆబాలగోపాలాన్ని అలరించే ఈ సీరియల్ లో ప్రధాన పాత్రల పోషణకు సమర్థులైన నటీనటుల ఎంపికను పరిశీలిస్తున్నట్లుగా తెలిపింది. తాజాగా రామాయణ ను కుటుంబ సభ్యులంతా కలిసి చూడదగిన దృశ్య కావ్యంగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని జీటీవీ కార్యక్రమాల విభాగం అధిపతి సుఖేశ్ మొత్వానీ వివరించారు.

    గతంలో 1980లో ప్రముఖ చిత్ర నిర్మాత రామానంద్ సాగర్...సాగర్ ఆర్ట్స్ పేరిట నిర్మించి, దర్శకత్వం వహించిన 'రామాయణ్' మంచి ఆదరణ పొందింది. అన్ని భాషల్లోనూ అనువాదమై సూపర్ అనే పేరు తెచ్చుకుంది. ఇలాంటి సీరియళ్లు మరలా ప్రసారం కావడం వల్ల ఈ జనరేషన్ పిల్లలకు మన పురాణాలు, భారతీయ చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం దక్కుతుందని, జీటీవీ చేపట్టనున్న ఈకార్యక్రమాన్ని అభినందిస్తున్నారు.

    English summary
    
 Popular mythological story 'Ramayan' is set to be retold on the small screen. Zee TV has announced the re-creation of the classic and it is already on the lookout for faces to play the epic's central characters Ram and Sita.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X