‘రామాయణ్’ వరల్డ్ రికార్డ్.. వ్యూయర్‌షిప్‌లో కొత్త ఒరవడి.. ఆ ఒక్క రోజే ఎంతమంది వీక్షించారంటే..?
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుని ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 25లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.అందులో రెండు లక్షలకుపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంతలా విజృంభిస్తున్న కరోనా ధాటికి తట్టుకునేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్‌ను పాటిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. ప్రజల వినోదం కోసం, వారి డిమాండ్ మేరకు నాటి క్లాసిక్ ధారావాహికలను భారత ప్రభుత్వం పున:ప్రసారం చేస్తోన్న సంగతి తెలిసిందే.

లాక్ డౌన్‌లో ప్రజల డిమాండ్..
శర వేగంగా విస్తరిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు గత నెల రోజుల నుంచి లాక్ డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజల కోరిక మేరకు రామాయణ్, మహాభారత్, శక్తిమాన్ వంటి ధారావాహికలను మళ్లీ ప్రసారం చేస్తున్నారు.

అత్యంత ఆదరణ..
ప్రజల కోరిక మేరకు లాక్ డౌన్‌లో రామాయణం ధారావాహికను ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 28న మొదటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ మేరకు మొదటి వారాంతంలోని ఎపిసోడ్‌కు విపరీతమైన స్పందన వచ్చిందని బార్క్(బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్) తెలిపింది.

మొత్తం 8.5కోట్ల మంది..
శనివారం ప్రసారమైన రెండు ఎపిసోడ్స్‌ను 34 మిలియన్స్ వీక్షించినట్టు బార్క్ లెక్కలు చెబుతున్నాయి. అయితే ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్స్‌ను దాదాపు 51మిలియన్ల మంది వీక్షించారు. ఇది గత కొన్నేళ్లుగా ఓ ధారావాహికకు వచ్చిన వాటిలో గొప్ప రికార్డ్. ఇలా మొత్తంగా రామయణ్ సీరియల్‌కు మొదటి వారంలో 85మిలియన్ వ్యూస్ దక్కాయని తెలుస్తోంది.
ప్రపంచ రికార్డు బద్దలు..
అయితే గత వార ప్రసారమైన ఎపిసోడ్‌తో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది డీడీ ఇండియా ట్వీట్ చేసింది. ‘దూరదర్శన్‌లో పున: ప్రసారం చేస్తున్నరామాయణ్ సీరియల్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యూయర్ షిప్ రికార్డులను చెరిపివేసింది. ఏప్రిల్ 16న ప్రసారమైన సీరియల్ దాదాపు 7.7కోట్ల వ్యూయర్ షిప్‌తో ప్రపంచలోనే ఎక్కువ మంది వీక్షించిన వినోదాత్మకంగా కార్యక్రమంగా రికార్డులు క్రియేట్ చేసింద'ని పేర్కొంది.


Click it and Unblock the Notifications











