twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెలివిజన్ తెరపై రామయణం.. మళ్లీ బుల్లితెర ప్రేక్షకులకు మధురానుభూతి

    |

    రామానంద్ సాగర్ రూపొందించిన పౌరాణిక టెలివిజన్ దృశ్యకావ్యం రామాయణం ఎంత ప్రేక్షకాదరణను పొందిందో అందరికి తెలిసిందే. ఆదివారం వచ్చిందటే ఇంటిల్లిపాది టీవీ సెట్లకు అతుక్కుపోయేవారు. మళ్లీ ఆ పాత రోజులను గుర్తు చేసేలా రామాయణం సీరియల్ టెలివిజన్‌ ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ధృవీకరించారు. పబ్లిక్ డిమాండ్ మేరకు రామాయణాన్ని మళ్లీ ప్రసారం చేస్తున్నాం అని అన్నారు.

    రామాయణం టెలివిజన్ విజన్ సీరియల్‌ను 21 రోజుల లాక్‌డౌన్ పిరియడ్‌లో ప్రసారం చేయాలని నిర్ణయించాం. మార్చి 24వ తేదీన ప్రధాని మోదీ ప్రకటించి విషయం తెలిసిందే అని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.

    Ramayana television serial re telecast in DD National

    పబ్లిక్ డిమాండ్‌పై రామాయణ సీరియల్‌ను ప్రసారం చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషంగా ఉన్నాం. శనివారం మార్చి 28వ తేదీ నుంచి దూరదర్శన్ నేషనల్ ఛానెల్‌లో ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, మళ్లీ రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్ ప్రసారం అవుతుంది అని జవదేకర్ ట్వీట్ చేశారు.

    1987 జనవరి 25వ తేదీ నుంచి 1988 జూలై 31వ తేదీ వరకు దూరదర్శన్‌లో రామాయణం సీరియల్ ప్రసారమైంది. ఈ సీరియల్ ప్రతీ ఇంటి కుటుంబ సభ్యుడికి చేరువైంది. మాకు ఎనలేని ప్రేక్షదారణను తెచ్చి పెట్టింది. అలాంటి సీరియల్ మళ్లీ ప్రసారం అవుతున్నదనే విషయం సంతోషాన్ని కలిగిస్తున్నది అని అరుణ గోవిల్ (రాముడు), దీపిక చికలియా (సీత) ఆనందాన్ని పంచుకొన్నారు.

    English summary
    Ramandand Sagar's epic Television show 'Ramayana' is all set to be aired on television yet again. Internet and broadcasting minister Prakash Javadekar confirmed that Happy to announce that on public demand, we are starting retelecast of 'Ramayana' from tomorrow, Saturday March 28 in DD National, One episode in morning 9 am to 10 am, another in the evening 9 pm to 10 pm.narendramodiPIBIndiaDDNational.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X