బుల్లి తెరపై ఎన్టీఆర్ వీరంగం
హైదరాబాద్: జూ ఎన్టీఆర్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' . ఈ చిత్రం ఇప్పుడు బుల్లి తెర ప్రేక్షకులను అలరించనుంది. మార్చి 16న జీ టీవీలో ఈ చిత్రం ప్రీమియర్ షో ప్రసారం కానుంది. ఈ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా బాగానే ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం. . జూ ఎన్టీఆర్, సమంత, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. చిత్రం శాటిలైట్ రైట్స్ మంచి క్రేజీ ఎమౌంట్ కి అమ్ముడయ్యాయి. మరి ఏ రేంజిలో బుల్లి తెరపై టీఆర్పీలు సంపాదిస్తుందో చూడాలి. టీవీల్లో ఎన్టీఆర్ చిత్రాలకు మంచి టీఆర్పీలు ఇన్నాళ్లూ వస్తున్నాయి.
దర్శకుడు హరీష్ శంకర్ ..పూర్తిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అలరించటానికి ఎంచుకునే ఎలిమెంట్స్ మీదే దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ గత చిత్రాల కన్నా గ్లామర్ గా కనిపించారు... డైలాగ్ డెలవరీలోనూ ఒక రకమైన ఈజ్ చూపిస్తూ వేరియేషన్ చూపించారు. అలాగే సినిమా మొత్తం ఎన్టీఆర్ భుజాలపైనే నడిచింది. ఫస్టాఫ్ ఫన్ తో,ఇంటర్వెల్ ట్విస్ట్ తో సేఫ్ గా నడిచిపోయనా సినిమాకు కీలకమైన సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ సోసోగా ఉండి నిరాశకలిగించింది.

కథేమిటంటే...ముఖేష్ రుషి తన పెద్ద కూతురు పెళ్లి చేయటానికి సన్నాహాలు చేస్తూంటే అతనిపై రైవల్ బ్యాచ్ అజయ్ గ్రూఫ్ ఎటాక్ చేస్తుంది. దాన్ని నుంచి తప్పించుకున్న ముఖేష్ రుషి పెళ్లి కి టైట్ సెక్యూరిటీ పెడతాడు. ఇదిలా ఉంటే మరో ప్రక్క కాలేజీలో చదువుకుంటున్న నందు(ఎన్టీఆర్) మరో కాలేజీలో చదువుతున్న అమ్మాయి అక్షర (సమంత)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను కూడా ప్రేమలో పడేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూంటాడు. ఆమె మొదట కాదన్నా...తర్వాత ఓకే అంటుంది. అంతేకాకుండా తన అక్క పెళ్లికి రమ్మంటుంది. ఇంతకీ సమంత ఎవరో కాదు ముఖేష్ రుషి రెండో కూతురు. ఆ పెళ్లికి వెళ్లిన ఎన్టీఆర్ ఏం చేసాడు. ముఖేష్ రుషి కి ... ఎన్టీఆర్ కి ఏంటి సంభంధం...శృతి హాసన్ పాత్ర ఏమిటి... అనేది మిగతా కథ.


Click it and Unblock the Notifications











