»   » రామోజీ గ్రూఫు నుండి మరో 4 టీవీ ఛానల్స్

రామోజీ గ్రూఫు నుండి మరో 4 టీవీ ఛానల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 1995 ఆగస్టు 27న ప్రారంభమైన ఈటీవీ నెట్వర్క్ కాలక్రమేనా పదుల సంఖ్యలో ఛానల్స్ తో విస్తరించింది. తెలుగుతో పాటు ఇతర బాషల్లో ఎంటర్టెన్మెంట్, న్యూస్ ఛానల్స్ ప్రారంభించారు. అయితే ఇటీవల తెలుగు తప్ప ఇతర భాషల్లోని ఛానల్స్ రిలయన్స్ గ్రూఫుకు విక్రయించిన సంగతి తెలిసిందే.

రామోజీ గ్రూఫు మళ్లీ సొంతంగా కొన్ని ఛానల్స్ ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. రిలయన్స్‌తో సంబంధం లేకుండా ఇటీవలే ఒరియాలో న్యూస్ ఛానల్ ప్రారంభించింది. తాజాగా ఇపుడు తెలుగులో ఒకేసారి నాలుగు ఛానల్స్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. ఆగస్టు 27న ఈటీవీ 20వ వార్షికోత్సవం సందర్భంగా వీటినిప్రారంభించనున్నట్లు సమాచారం.

Ramoji Group to launch four channels

ఇప్పటికే ఈటీవీ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. తెలుగు సినీ రంగంలోని ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 27న ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రారంభించనున్నారు. అదే రోజు ఈటీవీ ప్లస్, ఈటీవీ లైఫ్, ఈటీవీ సినిమాతో పాటు ఈటీవీ అభిరుచి ఛానల్స్‌ను ప్రారంభించేందుకు రామోజీ గ్రూఫ్ సన్నాహాలు చేస్తోంది.

ఈటీవీ ప్లస్ ఛానల్ పూర్తిగా యూత్‌ను ఆకట్టుకునే కార్యక్రమాలతో సాగుతుందని, ఈటీవీ లైఫ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ కార్యక్రమాలతో కుటుంబం, ఆరోగ్యం తదితర అంశాలతో సాగుతుందని, ఈటీవీ సినిమాలో పూర్తిగా సినిమాల ప్రసారం, ఈటీవీ అభిరుచిలో వంటలు, హెల్దీ ఫుడ్ తదితర అంశాలతో సాగుతుందని తెలుస్తోంది.

English summary
Ramoji Group to launch four channels
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu