Ramu Rathod Remuneration: రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్.. 9 వారాలకు ఎన్ని లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?
Ramu Rathod Remuneration: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదలైన దగ్గర నుండి ఎన్నో ఊహించని ట్విస్టులు, కంట్రావర్సీలు చోటుచేసుకున్నా.. ఈ వారం జరిగిన సంఘటన మాత్రం ప్రేక్షకుల మనసును కదిలించింది. ఫోక్ సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లోనూ, బయట ప్రేక్షకులలోనూ ఉద్వేగ వాతావరణం నెలకొంది. రాము హౌస్‌లో మానసిక ఒత్తిడి, కుటుంబం గుర్తొస్తుందనే భావోద్వేగంతో బయటకు వెళ్లిపోవాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో సెల్ఫ్ ఎలిమినేట్ కు కారణాలు, ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేది చర్చనీయంగా మారింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో భావోద్వేగ ఘట్టం చోటుచేసుకుంది. తొమ్మిది వారాలుగా హౌస్‌లో ఉన్న ఫోక్ సింగర్ రాము రాథోడ్, తాను ఇక ఈ హౌస్‌లో ఉండలేనంటూ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. మొదట్లో యాక్టివ్‌గా, టాస్క్‌లలో పాల్గొని హౌస్‌లో మంచి బాండింగ్ కలిగించిన రాము రాథోడ్, తరువాత క్రమంగా గేమ్‌పై ఆసక్తి కోల్పోయాడు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ తరువాత ఆయన ఉత్సాహం తగ్గి, టాస్క్‌ల్లో మధ్యలోనే "గివ్ అప్" చెప్పడం, నామినేషన్ల సమయంలో నిరుత్సాహంగా స్పందించడం ప్రేక్షకుల్లో నెగటివ్ ఇంప్రెషన్ ఇచ్చింది. అలాగే.. గత కొన్ని రోజులుగా ఇంటిపై బెంగ, తల్లిదండ్రుల జ్ఞాపకాలు, ఒంటరితనం రాముని మానసికంగా కలచివేశాయి. హోస్ట్ నాగార్జున ఎంత బ్రతిమిలాడినా, ఎంత ప్రోత్సహించినా రాము తన నిర్ణయం మార్చుకోలేదు.

ఈ నేపథ్యంలో హోస్ట్ నాగార్జున.. రాముతో మాట్లాడి, "ఏమైంది రామూ? హోమ్‌సిక్ అయిపోయావా? ఇంటి బెంగగా ఉందా?" అంటూ ప్రశ్నించారు. దానికి రాము పాట రూపంలో సమాధానం ఇచ్చాడు "బాధౌతుందే నీ యాదిలో మనసంతా.. మస్తు బరువౌతోందే అమ్మ యాదిలో మనసంతా" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ క్షణంలో ప్రేక్షకుల గుండెల్లోకి తాకేంతగా రాము తన బాధను వ్యక్తపరిచాడు.
తన చిన్ననాటి బాధలు, తల్లిదండ్రుల దూరం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. నాగార్జున ఎంత ప్రయత్నించినా, "హీరోలు ఆట మధ్యలో వదిలిపెట్టరు రామూ. నీకు 10 సెకన్లు ఇస్తున్నా, ఆలోచించు" అని కోరినా, రాము తన నిర్ణయంపై నిలబడ్డాడు.చివరకు నాగార్జున "బిగ్ బాస్, ఓపెన్ ది డోర్స్" అని ఆదేశించగా, రాము కన్నీళ్లతో హౌస్‌ను వీడాడు.
ఇంట్లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్ రామును ఆపడానికి ఎంత ప్రయత్నించినా, ఆయన మనసు మార్చలేదు. చివరకు బిగ్ బాస్ హౌస్‌లో రాము ప్రయాణం ముగిసింది. అయితే ఈ నిర్ణయంతో ఆయన ఇమేజ్ మాత్రం దెబ్బతినలేదు. ఆత్మాభిమానంతో, నిజాయితీ గల వ్యక్తిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. కొందరు అభిమానులు "బిగ్ బాస్ హౌస్‌కి వచ్చి ఇమేజ్ కాపాడుకోవడం అరుదు. కానీ రాము దాన్ని సాధించాడు" అని ప్రశంసిస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఇక రాము రాథోడ్ బిగ్ బాస్‌లో తొమ్మిది వారాలు ఉన్నాడు. ప్రతి వారం సుమారు రూ.2 లక్షలు పారితోషికంగా పొందారని సమాచారం. అంటే మొత్తం రూ.18 లక్షల వరకు ఆయనకు అందిందని చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాము ఫ్యాన్‌బేస్ పెరిగిపోతోంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఈ క్రేజ్ ఆయన ఫోక్ మ్యూజిక్ కెరీర్‌కు కొత్త దారులు తెరుస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. మొత్తం మీద.. రాము రాథోడ్ బయటకు వచ్చిన తీరు బిగ్ బాస్ చరిత్రలో గుర్తుండిపోయేలా మారింది. బిగ్ బాస్ 9లో ఇది నిజంగా ఒక హార్ట్ టచింగ్ మోమెంట్ అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











