సీన్ చేసిన వరుణ్ సందేశ్: నీకు ముద్దులు పెట్టి ముచ్చట తీర్చలేనంటూ భార్యతో...
బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్ 3 విజయవంతంగా 42 రోజులు పూర్తి చేసుకుంది. టీఆర్పీ రేటింగ్స్ పరంగా మంచి ఫలితాలు సాధిస్తూ దూసుకెళుతోంది. అక్కినేని నాగార్జున తనదైన శైలిలో షోను హోస్ట్ చేస్తూ ప్రేక్షకాదరణ పెంచడంలో సక్సెస్ అయ్యారు. అయితే ప్రస్తుతం నాగార్జున తన ఫ్యామిలీతో యూరఫ్ పర్యటనలో ఉండటంతో ఈ వారాంతం ఆయన షోను హోస్ట్ చేయలేకపోయారు. దీంతో బిగ్ బాస్ నిర్వాహకలు ప్రత్యామ్నాయంగా ప్రముఖ నటి రమ్యకృష్ణను రంగంలోకి దింపారు. శనివారం జరిగిన షోలోకి ఎంటరైన ఆమె తనదైన శైలిలో ప్రోగ్రాంను రక్తికట్టిస్తున్నారు.

సీన్ చేయించిన రమ్య కృష్ణ
ఆదివారం రాత్రి ప్రసారం అయ్యే వీకెండ్ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఒకటి స్టార్ మా వారు విడుదల చేశారు. సాధారణంగా మాట్లాడుతుంటే సీన్ చేయకు, సీన్ చేయకు అంటారు. కానీ ఇక్కడ రమ్యకృష్ణ ఇంటి సభ్యులతో సీన్ చేయించారు.

చంద్రముఖి సీన్ చేసిన శ్రీముఖి
రమ్యకృష్ణ యాక్షన్ చెప్పగానే శ్రీముఖి... చంద్రముఖి సీన్ చేసి చూపించారు. బాబా భాస్కర్, శ్రీముఖి మధ్య జరిగే ఈ సీన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది. పునర్నవి, రాహుల్ కలిసి లవర్స్ మాదిరిగా నటించారు. ఇంట్లో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే రూమర్ల నేపథ్యంలో వీరితో అలాంటి సీనే చేయించడం చర్చనీయాంశం అయింది.

ముద్దులు ముచ్చట్లు ఏమీ లేవు
వరుణ్ సందేశ్, వితికి మధ్య జరిగిన మరో సీన్ ఆసక్తికరంగా ఉంది. బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాత నీ ప్రేమ, ముద్దులు, ముచ్చట్లు ఏమీ లేవు అంటూ వితిక ఏడ్చేయడం.... ఇక్కడ ముద్దు, ముచ్చట్లు చేస్తే బావుండదు కదా అంటూ వరుణ్ సందేశ్ ఆమె కోరికను తిరస్కరించడం ఫన్ క్రియేట్ చేసింది.

ఇంతకీ ఈవారం ఎలిమినేషన్ ఉంటుందా?
వరుణ్ సందేశ్, వితికి మధ్య జరిగిన మరో సీన్ ఆసక్తికరంగా ఉంది. బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాత నీ ప్రేమ, ముద్దులు, ముచ్చట్లు ఏమీ లేవు అంటూ వితిక ఏడ్చేయడం.... ఇక్కడ ముద్దు, ముచ్చట్లు చేస్తే బావుండదు కదా అంటూ వరుణ్ సందేశ్ ఆమె కోరికను తిరస్కరించడం ఫన్ క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











