బిగ్‌బాస్‌కు నాగార్జున దూరం.. హోస్ట్‌గా ఫైర్‌బ్రాండ్ హీరోయిన్ రంగ ప్రవేశం!

తెలుగు బిగ్‌బాస్ షో రంజుగా సాగుతున్న సమయంలో హోస్ట్ నాగార్జున కొద్ది రోజులపాటు ఈ రియాలిటీ షోకు దూరంగా ఉంటున్నారనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ముందస్తు ప్లాన్‌లో భాగంగా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో కొన్ని ఎపిసోడ్స్‌లో నాగార్జున కనిపించరు అనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఈ క్రమంలో రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తారనే మాట తెరపైకి వచ్చింది. ఈ వివారాల్లోకి వెళితే...

గత సీజన్‌లో రమ్యకృష్ణ హోస్ట్‌గా

గత సీజన్‌లో రమ్యకృష్ణ హోస్ట్‌గా

గత సీజన్‌లో నాగార్జున తన 60 బర్త్ డే సందర్భంగా విహార యాత్ర కోసం ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లిన క్రమంలో హోస్ట్‌గా రమ్యకృష్ణ రంగ ప్రవేశం చేశారు. రెండు రోజులపాటు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకొన్నారు. ఇంటి సభ్యుల తీరును రమ్యకృష్ణ ఘాటుగా ప్రశ్నిస్తూ తన హుందాతనాన్ని చాటుకొన్నారు.

 అరుదైన రికార్డుతో రమ్యకృష్ణ

అరుదైన రికార్డుతో రమ్యకృష్ణ

అలా బిగ్‌బాస్‌లో హోస్ట్‌గా కనిపించి రమ్యకృష్ణ ఓ రికార్డును సొంతం చేసుకొన్నారు. బిగ్‌బాస్ ప్రాంతీయ భాషల్లో హోస్ట్‌గా పాల్గొన్న తొలి వ్యక్తిగా రమ్యకృష్ణ అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకొన్నారు. వెండి తెరపైనే కాదు.. బుల్లితెరపైనా రాణించగలనని సంకేతాలు ఇచ్చారు. అలా మరోసారి రమ్యకృష్ణకు హోస్ట్‌గా నటించే అవకాశం దక్కినట్టు తెలుస్తున్నది.

వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం

వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం

ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ అనే చిత్రం షూటింగు కోసం కొన్ని రోజులపాటు అందుబాటులో ఉండరు. ఆయ న విదేశాలకు వెళ్తున్నందున్న ఆయన స్థానంలో రమ్యకృష్ణను హోస్ట్‌గా వ్యవహరించాలని నిర్వాహకులు సంప్రదించారు. అందుకు రమ్యకృష్ణ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

నాని, ఎన్టీఆర్‌తో సంప్రదింపులు

నాని, ఎన్టీఆర్‌తో సంప్రదింపులు

ఇదిలా ఉండగా, రమ్యకృష్ణతోపాటు గత సీజన్‌లో హోస్టులుగా వ్యవహరించిన నాని, ఎన్టీఆర్‌తో కూడా బిగ్‌బాస్ షో నిర్వాహకులు చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే షూటింగులు మొదలైన క్రమంలో తాము అందుబాటులో ఉండలేమని సున్నితంగా ఆఫర్‌ను తిరస్కరించినట్టు సమాచారం.

Recommended Video

Bigg Boss Telugu 4 : Bigg Boss షో నుంచి తప్పుకుంటున్న Nagarjuna..హోస్ట్ గా నేచురల్ స్టార్ Nani
నాగభైరవి టెలి సీరియల్‌తో

నాగభైరవి టెలి సీరియల్‌తో

ప్రస్తుతం రమ్యకృష్ణ జీ తెలుగులో నాగభైరవి అనే భక్తి ప్రధానమైన సీరియల్‌‌లో నటించనున్నారు. ప్రస్తుతం ఆ టెలి సీరియల్ షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సీరియల్ అక్టోబర్ 12వ తేదీన ప్రారంభం కానున్నది. ఈ క్రమంలో డేట్స్ చూసుకొని షూటింగుకు హాజరయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది. అయితే త్వరలోనే అధికారికంగా ఓ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X