నా మాటే శాసనం.. బాబా భాస్కర్‌కు రమ్యకృష్ణ వార్నింగ్.. హోస్ట్‌గా అదుర్స్!

బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో తొలిసారి హోస్ట్ లేకుండా వీకెండ్ ఎలిమినేషన్ కార్యక్రమం నడిచింది. అక్కినేని నాగార్జున జన్మదినాన్ని జరుపుకోవడానికి స్పెయిన్‌లోని ఐబిజాలో విహారయాత్రకు వెళ్లడంతో బిగ్‌బాస్ వేదికపైకి హోస్ట్‌గా రమ్యకృష్ణ నడిచి వచ్చింది. నా మాటే శాసనం అంటూ రమ్యకృష్ణ ఝలక్ ఇచ్చింది. ఇంతకు హౌస్‌ను ఎలా నడిపారంటే..

ఫారిన్ నుంచి నాగార్జున

ఫారిన్ నుంచి నాగార్జున

శనివారం బిగ్‌బాస్ ఎపిసోడ్ ప్రారంభం కావడంతోనే ఎక్కడో ఫామ్ హౌస్‌లో నాగార్జున కనిపించాడు. యదావిధిగా నేను నాగార్జున అంటూ యాడ్ గురించి చెప్పి బిగ్‌బాస్‌ను ప్రారంభించారు. అయితే తాను బర్త్ డే కోసం విదేశాలకు వచ్చానని, అందుచేత ఈ వారం హోస్ట్ చేయలేకపోతున్నాను. వచ్చేవారం యధావిధిగా ప్రారంభిస్తాను అని చెప్పారు.

రమ్యకృష్ణ గ్రాండ్ ఎంట్రీ

రమ్యకృష్ణ గ్రాండ్ ఎంట్రీ

నా అందుబాటులోకి లేకపోవడం వల్ల హోస్ట్‌గా ఎవరిని పెట్టాలని ఆలోచించాను. బిగ్‌‌బాస్‌కు హోస్ట్‌గా ఎవరుండాలని ఆలోచించినప్పుడు నా మదిలో, నా మనసుకు తట్టింది ఒకే పేరు.. అది క్వీన్ అని చెప్పగానే.. గ్రాండ్ రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చింది. వస్తూ వస్తూనే నా మాటే శాసనం అంటూ హడలెత్తించింది.

నాగార్జున నా గైడ్, ఫిలాసఫర్

నాగార్జున నా గైడ్, ఫిలాసఫర్

రమ్యకృష్ణ ఇంటి వేదికపైకి వచ్చి.. మనకు ఇష్టమైన వాళ్లు ఏదైనా అడిగితే కాదనలేం. నాగార్జునతో నా ప్రయాణం చాలా గొప్పది. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. నాగార్జున నాకు ఫ్రెండ్, గైడ్, ఫిలాసపర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తింది. అంతేకాకుండా నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పి బిగ్‌బాస్ కార్యక్రమాన్ని ఆరంభించింది.

నా మాటే శాసనం

నా మాటే శాసనం

ఇక బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీలను కూడా బాగానే కంట్రోల్ పెట్టింది. ఓ దశలో నా మాటే శాసనం అంటూ రమ్యకృష్ణ గద్దించింది. అలాగే బాబా భాస్కర్‌కు నేను చెప్పిందే వినాలి.. నేను నాగార్జున మాదిరిగా కాదు ఆమె వార్నింగ్‌ కూడా ఇచ్చింది. తొలుత శుక్రవారం ఇంటి సభ్యులేమి చేశారని మన టీవీలో చూసింది. ఇంటి సభ్యుల యాక్టివిటీని చూస్తూ కామెంటరీ చేసింది.

ఇంటిసభ్యులతో

ఇంటిసభ్యులతో

బిగ్‌బాస్‌లొ ఇంటి సభ్యులు కొట్లాటలు, గొడవలను చూసి ఎంజాయ్ చేసింది. లేడిస్, జెంట్స్ సెలబ్రిటీల గురించి కామెంట్ చేస్తూ.. ఇంటిలోకి ప్రవేశించింది. ఇంటిలో నాగార్జున బర్త్ డే కోసం డెడికేట్ చేస్తూ బాబా భాస్కర్, రాహుల్ రూపొందించిన పాటకు ఇంటి సభ్యులందరూ డ్యాన్స్ చేశారు. అది చూసి రమ్యకృష్ణ హ్యాపీగా ఫీలయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X