For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి రేంజ్‌లో నాగ భైరవి.. శివగామికి ధీటుగా రమ్యకృష్ణ

    |

    శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటించిన తీరుకు యావత్ భారత సినీ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇంతకు ముందు కూడా నీలాంభరి వంటి విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించిన రమ్యకృష్ణకు శివగామి పాత్ర సెకండ్ ఇన్నింగ్స్‌కు బూస్టప్ ఇచ్చింది. ఆ తరువాత కొన్ని సినిమాలు వచ్చినా అవి వర్కౌట్ కాలేదు. కానీ రమ్యకృష్ణకు ఉన్న క్రేజ్ ఏ మాత్ర తగ్గలేదు. ఈ మధ్య రమ్యకృష్ణ బుల్లితెరపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.

     పలు ప్రాజెక్ట్‌లతో సందడి..

    పలు ప్రాజెక్ట్‌లతో సందడి..

    రమ్యకృష్ణన్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్‌లతో సందడి చేస్తోంది. విజయ్ దేవరకొండ-పూరి కాంబోలో రాబోతోన్న ఫైటర్ చిత్రంలో రమ్యకృష్ణ ప్రత్యకమైన పాత్రలో నటిస్తోంది. ఇక రంగ మార్తాండ అంటూ కృష్ణవంశీ తెరకెక్కించబోతోన్న రీమేక్ ఓ స్పెషల్ క్యారెక్టర్ పోషించబోతోంది. ఇప్పుడు మాత్రం రమ్యకృష్ణ మాత్రం బుల్లితెరపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.

    షూటింగ్ మొదలెట్టినప్పుడు అలా..

    షూటింగ్ మొదలెట్టినప్పుడు అలా..

    ‘మీకు నాటి రోజులు గుర్తున్నాయా? వేసవి సెలవులు అయ్యాక స్కూల్‌కు వెళ్లాలంటే ఎలా ఫీలయ్యేవారో.. ప్రస్తుతం నాకు అదే ఫీలింగ్' అంటూ నటుల జీవితం, షూటింగ్స్ ఇలా ఉంటాయని ఆ మధ్య రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది. అయితే ఆప్పుడు ఆ షూటింగ్‌కు సంబంధించిన వివరాలేవీ ప్రకటించలేదు గానీ తాజాగా వాటి సంగతులు బయటకు వచ్చాయి.

    ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్..

    ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్..

    తెలుగు బుల్లితెరపై నాగమ్మ సీరియల్‌కు ఎంతటి క్రేజ్ ఉండేదే అందరికీ తెలిసిందే. హిందీలో నాగిని అంటూ సీజన్లను పెంచుకుంటూనే ఉన్నాడు. నాగదేవత, నాగవంశం, శివుడు ఇలాంటి కాన్సెప్ట్‌లు బుల్లితెరపై ఎవర్ గ్రీన్ కాన్పెప్ట్‌లు. ఎప్పుడూ కూడా ఇవి బోర్ కొట్టవు. అందుకే జీ తెలుగు వారు నాగ సంపద అనే కాన్సెప్ట్‌తో నాగ భైరవి అనే ఓ సీరియల్‌ను ప్రసారం చేయబోతోన్నారు.

     గ్రాండ్‌గా ప్రోమో..

    గ్రాండ్‌గా ప్రోమో..

    తర తరాలుగా నాగ సంపదను రమ్యకృష్ణ వంశం కాపాడుకుంటూ వస్తోండగా.. వారికి ప్రమాదాలు ఏర్పడేట్టు కనిపిస్తోంది. ఇందులో రమ్యకృష్ణ పాత్రను మెయిన్‌గా కనిపించగా.. భైరవి పాత్రతో సీరియల్ ముందుకు సాగబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇక బాహుబలి రేంజ్‌లో గ్రాఫిక్స్, పాములు, కాళ భైరవుడి విగ్రహం అవన్నీ చూస్తుంటే ఎంతో రిచ్‌గా కనిపిస్తోంది. మరి ఈ సీరియల్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

    English summary
    ramya Krishnan Naga Bhairavi Serial Promo Goes Viral, ramya Krishnan Also Appeared in Sa Re ga ma Singing Icon,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X