నువ్వే పెద్ద కోతివి.. యాంకర్ ప్రదీప్ ఆటాడుకొన్న రమ్యకృష్ణ!
దక్షిణాది తెరపై చిరకాలం నిలిచిపోయే పాత్రలను ఫైర్‌బ్రాండ్ యాక్టర్ రమ్యకృష్ణ పోషించారు. నరసింహ, బాహుబలి లాంటి సినిమాలు ఆమె నటనా విశ్వరూపానికి సాక్ష్యాలుగా నిలిచాయి. ఎలాంటి పాత్ర పోషించినా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఆమె లక్షణం. అలాంటి ప్రతిభావంతురాలైన నటి రమ్యకృష్ణ కొత్త అవతారం ఎత్తారు. లాక్‌డౌన్ తర్వాత తొలిసారి జీ తెలుగు టెలివిజన్ రూపొందించిన సారేగామాపా కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో ప్రోమోలో యాంకర్ ప్రదీప్‌ను రమ్యకృష్ణ ఆడేసుకొన్నట్టు స్పష్టమవుతున్నది. ఈ కార్యక్రమ ప్రోమోలోకి వెళితే..

నా మాటే శాసనం అంటూ ఎంట్రీ
సారేగామాపా ది నెక్ట్స్ సింగింగ్ ఐకాన్ షోకు వచ్చిన రమ్యకృష్ణ కోసం అట్టహాసమైన ఏర్పాట్లు చేశారు. ఆమె ఠీవీకి తగినట్టు సింహాసనం, నా మాటే శాసనం అంటూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టారు. రాజసంగా నడిచి వస్తున్న ఆమెకు గ్రాండ్‌గా కంటెస్టెంట్లు, యాంకర్ ప్రదీప్ స్వాగతం పలికారు.

తోకలేని కోతులు అంటూ ప్రదీప్
సారేగామాపా ది నెక్ట్స్ సింగింగ్ ఐకాన్ షో వేదికపైకి వచ్చిన రమ్యకృష్ణకు జడ్జీలను, కంటెస్టెంట్లను పరిచయం చేస్తూ.. ఈ బ్యాచ్ అంతా తోకలేని కోతులు.. వారు.. ఇటువైపు ఉన్న వారు అంటూ కంటెస్టెంట్లను చూపుతూ వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు.. నెక్ట్స్ కోతులను తయారు చేయడానికి అని ప్రదీప్ అంటుండగా.. మీరే కదా మెయిన్ కోతివి అంటూ రమ్యకృష్ణ చురకలు అంటించారు.

చిన్నప్పటి నుంచి చూస్తున్నాను
రమ్యకృష్ణ ఇచ్చిన షాక్ నుంచి తేరుకొంటూ నా గురించి చెప్పడానికే తయారు అవుతున్నాను. నా పేరు ప్రదీప్ అని అనగానే.. నాకు తెలుసు... నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటూ రమ్యకృష్ణ మరో స్ట్రోక్ ఇచ్చారు. దాంతో కంటెస్టెంట్లు, జడ్జీలు నవ్వుల్లో మునిగిపోయారు.

ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సారేగామపా
జీ తెలుగు రిలీజ్ చేసిన షో ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకునేలా, చాలా ఇంట్రెస్టింగ్గా రూపొందించినట్టు స్పష్టమైంది. సరదాగా, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగినట్టు కనిపించింది. లాక్‌డౌన్ తర్వాత రమ్యకృష్ణ హాజరైన తొలి షూటింగ్ ఇదే. చాలా రోజుల తర్వాత మళ్లీ పనిలోకి రావడం హ్యాపీగా ఉందంటూ రమ్యకృష్ణ ట్వీట్ చేశారు.
Recommended Video

రమ్యకృష్ణ కెరీర్ ఇలా
రమ్యకృష్ణ కెరీర్ విషయానికి వస్తే.. దాదాపు 20 ఏళ్ల తర్వాత బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో కరణ్ జోహర్ నిర్మాతగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఫైటర్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తన కుమారుడు అకాశ్ హీరోగా పూరీ నిర్మించే మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్నాయి.


Click it and Unblock the Notifications











