బిగ్ బాస్‌కు మరో హోస్ట్: నాగ్, సమంత తర్వాత ఇంకొకరు.. ఆయన రిక్వెస్ట్‌తోనే ఇలా.!

By Manoj

తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఘనమైన రికార్డులతో దూసుకుపోతోంది బిగ్ బాస్ షో. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కంటెంట్‌తో నడిచే ఈ షోను ఇక్కడి ప్రేక్షకులు త్వరగానే ఆదరించారు. అదే సమయంలో అద్భుతమైన స్పందనను అందించి దీన్ని సూపర్ డూపర్ హిట్ చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకునే షో నిర్వహకులు వరుసగా కొత్త కొత్త సీజన్లను ప్రసారం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న నాలుగో సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్‌లోకి నాగార్జున, సమంత తర్వాత మరో హోస్ట్ రాబోతున్నారని ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

హాఫ్ సెంచరీ పూర్తి చేసిన బిగ్ బాస్ 4

హాఫ్ సెంచరీ పూర్తి చేసిన బిగ్ బాస్ 4

ఎన్నో అంచనాల నడుమ అక్కినేని నాగార్జున సారథ్యంలో గత నెలలో ప్రారంభం అయింది బిగ్ బాస్ సీజన్ 4. ప్రీమియర్ ఎపిసోడ్‌తో రికార్డులు క్రియేట్ చేసిన ఈ షో.. ఆ తర్వాత చప్పగా సాగింది. అయితే, షో నిర్వహకుల సరికొత్త వ్యూహాలతో అమాంతం ఊపందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికి యాభై రోజులు పూర్తి చేసుకోవడంతో పాటు సక్సెస్‌ఫుల్‌గా ప్రసారం అవుతోంది.

బిగ్ బాస్ షోకు దూరమైన నాగార్జున

బిగ్ బాస్ షోకు దూరమైన నాగార్జున

తనదైన శైలి హోస్టింగ్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడంతో పాటు ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. గత ఏడాది జరిగిన మూడో సీజన్‌ను విజయవంతగా పూర్తి చేసిన ఆయన.. నాలుగో దాన్ని సైతం అదే రీతిలో నడిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో తన సినిమా ‘వైల్డ్ డాగ్' షూటింగ్ కోసం బిగ్ బాస్ షోకు దూరమయ్యారు.

నాగార్జున స్థానంలో స్టార్ హీరోయిన్

నాగార్జున స్థానంలో స్టార్ హీరోయిన్


సోలోమన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘వైల్డ్ డాగ్' షూటింగ్ కోసం నాగార్జున కులుమనాలీలో ఉన్నారు. అక్కడ 21 రోజుల పాటు చిత్రీకరణ జరగనుంది. ఈ విషయాన్ని వీడియో సందేశం ద్వారా నాగార్జునే స్వయంగా వెల్లడించారు. ఇక, ఆయన అందుబాటులో లేకపోవడంతో బిగ్ బాస్ షోను గత వారం స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అదరగొట్టిన అక్కినేని వారి కోడలు

అదరగొట్టిన అక్కినేని వారి కోడలు

తన మామ అక్కినేని నాగార్జున స్థానంలో బిగ్ బాస్ హోస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించింది సమంత. దసరా స్పెషల్‌గా ప్రసారం అయిన ఎపిసోడ్‌ను ఆమె అద్భుతంగా నడిపించింది. దగ్గరుండి చూసినట్లే కంటెస్టెంట్ల జాతకాలను చెప్పేసిన ఆమె.. వాళ్లందరితో కలిసిపోయింది. దీంతో అప్పటి నుంచి బిగ్ బాస్ షోకు మరో ప్రత్యమ్నాయ హోస్ట్ దొరికిందన్న కామెంట్లు బాగా వినిపిస్తున్నాయి.

సమంత ఔట్.. నాగార్జునపై భారం

సమంత ఔట్.. నాగార్జునపై భారం

హోస్టింగ్‌లో ఆకట్టుకున్న సమంత వచ్చే వారం కూడా బిగ్ బాస్ షోను నడిపిస్తుందనుకుంటున్న సమయంలో ఆమె దీని నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కారణం ఏంటో తెలియదు కానీ.. ఆమె హోస్టింగ్ చేయలేనని స్పష్టం చేసేసిందట. దీంతో షో నిర్వహకులు నాగార్జునపై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అదిరిపోయే ప్లాన్ వేసినట్లు తాజా సమాచారం.

నాగ్, సమంత తర్వాత ఇంకొకరు

నాగ్, సమంత తర్వాత ఇంకొకరు


నాగార్జున, సమంత అందుబాటులో లేకపోవడంతో వచ్చే వారం రెండు ఎపిసోడ్లను మరొకరు హోస్ట్ చేయబోతున్నారట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రమ్యకృష్ణ మరోసారి స్పెషల్ హోస్ట్‌గా రాబోతున్నారట. గత సీజన్‌లోనూ ఆమె ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగార్జున రిక్వెస్ట్ మేరకు ఆమె మరోసారి బిగ్ బాస్ హోస్ట్‌గా కనిపించనున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X