ఆ కంటెస్టెంట్‌కే బిగ్‌బాస్ టైటిల్.. మ్యాచ్ ఫిక్సింగ్ అలా.. అందుకే నన్ను ఎలిమినేట్.. పికిల్ బేబీ రమ్య ఆరోపణలు
పికిల్స్ బేబీగా పేరు తెచ్చుకొన్న రమ్య మోక్ష బిగ్‌బాస్ షో నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయింది. అయితే ఎలిమినేషన్ తర్వాత ఆమె విడుదల చేసిన వీడియోలు సెన్సేషన్‌గా మారాయి. షోలో జరుగుతున్న తీరుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బిగ్‌బాస్ షోలో జరుగుతున్న విషయాలను వీడియో ఫుటేజ్ ద్వారా పంచుకొనే ప్రయత్నం చేశారు. ఇప్పటికే నిర్వాహకులు ఒక కంటెస్టెంట్‌కు ఫేవరిటిజం చూపిస్తున్నారు. ఆమెకు ట్రోఫిని ఇవ్వాలని డిసైడ్ అయ్యారు అంటూ ఆమె కామెంట్స్ చేశారు. రమ్య విడుదల చేసిన వీడియోలలో ఆమె చేసిన ఆరోపణల వివరాల్లోకి వెళితే...
బిగ్‌బాస్ షోలో నేను లవ్ కంటెంట్ ఇవ్వలేకపోయాను. అది కాకుండా తనూజాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో ఆమె పెర్ఫార్మెన్స్ పడిపోతుందని భావించారు. అందుకే నన్ను ఎలిమినేట్ చేశారు. ఎలిమినేషన్ తర్వాత నాకు వచ్చిన ఓటింగ్ చూసుకొన్నాను. నాకు తక్కువ ఓట్లేమీ రాలేదు. నేను మూడు, నాలుగో స్థానంలో ఉన్నాను. చివరిలో ఉన్న వారికి ఆడియో వీడియో ప్రజెంటేషన్ రెడీ చేసి ఎలిమినేట్ చేయాలి. ఆ రోజు వచ్చిన ఓట్ల ప్రకారం.. శ్రీనివాససాయిని ఎలిమినేట్ చేయాలి. కానీ నన్నెందుకు ఎలిమినేట్ చేశారు అని పికిల్ బేబీ రమ్య మోక్ష ప్రశ్నించారు.

నా నుంచి లవ్ కంటెంట్ ఊహించారు. కానీ నేను దానికి సిద్దపడలేదు. నేను షోలో ఉండటం వల్ల తనూజకు నెగిటివ్ అవుతుంది. తనూజ లవ్ కంటెంట్ ఇవ్వడం లేదు. నేను ఉంటే ఆమెపై దెబ్బ పడుతుంది. అందుకే సాయిని తప్పించి నన్ను ఎలిమినేట్ చేశారు. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంటిలో 16 మంది విభిన్నమైన వ్యక్తులతో డీల్ చేశాను. అక్కడ పొల్యూట్ కాకుండా నా జీవితంలో నేను హ్యాపీగా నా బిజినెస్ ఇతర విషయాలపై ఫోకస్ చేసుకోవాలని అనుకొంటున్నాను. నేను ఎలిమినేట్ కావడంపై నాకు ఎలాంటి బాధ లేదు. ముందు రోజే సంజనతో నేను ఎలిమినేట్ అయిపోతే బాగుండని చెప్పాను.
తనుజాకు కప్ అని నిర్వాహకులు ఫిక్స్ అయ్యారు. అమెకు కప్ ఇవ్వాలని డిసైడ్ అయిన తర్వాత వేరే కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసి వారిని ఫూల్ చేయడం ఎందుకు? కప్ ఇవ్వాలనుకొంటే ఆమెకే ఇవ్వోచ్చు కదా.. షోలో జరిగేది ఒకటి.. బయటకు చూపించేది మరోకటి. నాకు నెగిటివ్ అయ్యేలా కంటెంట్ చూపించారు. మీకు ఫేవరిటిజం చూపించాలనుకొన్నప్పుడు.. ఇతరులను ఎంపిక చేసి వారిని బ్యాడ్ చేయాలని చూడటం చాలా తప్పు అని రమ్య అన్నారు.
నిర్వాహకుల అంచనాలకు తగినట్టుగా నేను ఆడకపోవడం, నాకు ఏమీ అనిపిస్తే.. అది నేను మాట్లాడటం చేశాను. నా మనస్తత్వానికి భిన్నంగా మాట్లాడటం ఇష్టం. ముక్కుసూటిగా మాట్లాడటం నా నైజం. అందుకే నన్ను ఎలిమినేట్ చేశారు. నాకు సంబంధించిన సీన్లు ఒకలా ఉంటే.. వాటిని రివర్స్ పెట్టి చూపించారు. లైవ్‌లో చూస్తే మీకే అర్ధం అవుతుంది. షోలో అంతా ఉల్టా అని రమ్య ఆరోపించారు.


Click it and Unblock the Notifications











