పెళ్లి విషయంలో తొందర పడ్డావా చైతు.. ఇదెక్కడి దారుణంరా బాబూ.. ఆడేసుకున్నాడుగా!
ఈ ఏడాది రెండు చిత్రాలతో నాగ చైతన్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల శైలజారెడ్డి అల్లుడిగా చైతన్య సందడి చేశాడు. నేడు చైతు నటించిన సవ్యసాచి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సవ్యసాచి చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా సవ్యసాచి చిత్ర యూనిట్ ఇటీవల నెం.1 యారి కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమానికి సంబందించిన ప్రోమోని రానా ట్వీట్ చేశాడు.

హోస్ట్‌గా రానా
రానా వరుసగా రెండవ సీజన్ లో నెం 1 యారీ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. రానా సాధారణంగా ఎంత సరదాగా ఉంటాడో అందరికి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కూడా జోకులు పేలుస్తూ కార్యక్రమాన్ని వినోదభరితంగా నడిపిస్తున్నాడు.

సవ్యసాచి చిత్ర టీమ్
సవ్యసాచి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నెం 1 యారీ కార్యక్రమంలో చైతు, నిధి అగర్వాల్, దర్శకుడు చందు ముండేటి పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ చాలా సరదాగా సాగినట్లు ప్రోమో ద్వారా అర్థం అవుతోంది. రానా తన ప్రశ్నలతో చైతూని ఒక ఆట ఆడేసుకున్నాడు. సమంత గురించి ప్రశ్నలు అందగడంతో చైతు బాగా ఇబ్బంది పడిపోయాడు.
Recommended Video


తొందరపడ్డావా చైతు
చైతూకు రానా ఊహించని ప్రశ్నలు సంధించాడు. పెళ్లి కోసం తొందరపడ్డానని ఎప్పుడైనా అనిపించిందా అని రానా అడగగా.. ఇదెక్కడి దారుణంరా బాబూ.. మొన్ననే ఫస్ట్ యానవర్సరీ కూడా పూర్తయిపోయింది అంటూ సమాధానం ఇచ్చాడు.

రోజులో ఎన్నిసార్లు ఫోన్ వస్తుంది
చైతన్య అమ్మాయిల్లో ఎక్కువగా ఏం గమనిస్తాడు అని రానా చందు ముండేటిని అడుగుతాడు. దాని గురించి ఎందుకులే అన్న అంటూ చందు తప్పించుకుంటాడు. సమంత నుంచి ఒకరోజులో చైతూకి ఎన్నిసార్లు ఫోన్ వస్తుంది అని అడగగా.. రెండు మూడుసార్లు కంగారుగా పక్కకు వెళుతారు.. అంటే అది సమంత నుంచి ఫోన్ రావడం వల్లనే ఏమో అంటూ చందు బదులిస్తాడు.

నిధి అగర్వాల్ కూడా
నిధి అగర్వాల్ పై కూడా బాగా జోకులు పేలినట్లు తెలుస్తోంది. నెం 1 యారీ ద్వారా ఈ వీక్ ని సెలెబ్రేట్ చేసుకుందాం అంటూ రానా ట్వీట్ చేశాడు. పూర్తి ఎపిసోడ్ ఆదివారం రోజు ప్రసారం కానుంది.


Click it and Unblock the Notifications











