»   » నాగ్, చిరు, ఎన్టీర్.... ఇపుడు రానా కూడా, ఇక రచ్చ రంబోలా!

నాగ్, చిరు, ఎన్టీర్.... ఇపుడు రానా కూడా, ఇక రచ్చ రంబోలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెండితెర స్టార్లు ఒకప్పుడు బుల్లితెర వైపు రావడానికి పెద్దగా ఆసక్తి చూపే వారు కాదు. అయితే ఇపుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పేరుకే బుల్లితెర కానీ.... అటు మార్కెట్ పరంగా, ఇటు రెవెన్యూ పరంగా వెండితెరతో పోటీ పడుతోంది. స్టార్ నెట్వర్క్, జీ నెట్వర్క్, సన్ నెట్వర్క్ లాంటి కార్పొరెట్ సంస్థలు రాకతో వెండితెరపై కోట్లాది రూపాయల ఖర్చుతో వినూత్నమైన కార్యక్రమాలు రూపొందుతున్నాయి.

బుల్లితెర కార్యక్రమాలకు మరింత ఆదరణ, టీఆర్పీ రేటింగులు పెంచడంలో భాగంగా పెద్ద పెద్ద స్టార్లను రంగంలోకి దింపుతున్నాయి ఆయా సంస్థలు. బాలీవడ్లో ఎప్పటి నుండో ఇలాంటివి కొనసాగుతుండగా టాలీవుడ్లోనూ ఈ జోరు పెరుగుతోంది. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి వారు బుల్లితెర ఎంట్రీ ఇవ్వగా త్వరలో రానా కూడా ఇందులోకి ఎంటరవుతున్నాడు.

నెం.1 యారి విత్ రానా

త్వ‌ర‌లో జెమిని టీవీలో ప్రారంభం కానున్న‌ 'నెం. 1 యారీ విత్ రానా' అనే చాట్ షోకు రానా హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ రిలీజైంది.

స్టార్ ఇమేజ్ పెంచుకోవడమే లక్ష్యం

స్టార్ ఇమేజ్ పెంచుకోవడమే లక్ష్యం

సినిమాలు చేస్తూనే బుల్లితెర కార్యక్రమాలు చేయడం ద్వారా ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు స్టార్ ఇమేజ్ కూడా బాగా పెరుగుతుందనే ఉద్దేశ్యంతో సినీమా స్టార్లు బుల్లితెర నుండి వస్తున్న ఆఫర్లను అంగీకరిస్తున్నారు.

మీలో ఎవరు కోటీశ్వరుడు

మీలో ఎవరు కోటీశ్వరుడు

ఇప్పటికే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో ద్వారా టాలీవుడ్ అగ్రహీరోలు నాగార్జున, చిరంజీవి బుల్లితెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ ఎన్టీఆర్

బిగ్ బాస్ ఎన్టీఆర్

త్వరలో ‘బిగ్ బాస్' అనే రియాల్టీ షో ద్వారా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర ఎంట్రీ ఇస్తున్నారు. హిందీలో ‘బిగ్ బాస్' కార్యక్రమాన్ని సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తుండగా తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నారు.

English summary
Tollywood actor Rana Daggubati will be debuting on the small screen with his upcoming show titled No 1 Yaari with Rana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu