‘నాగార్జున అక్కినేని కంటే రానా దగ్గుబాటి బెటర్’
తెలుగు ప్రేక్షకుల్లో పెద్ద హిట్ అయ్యిన టెలివిజన్ రియాలిటీ షోస్ లో అప్పుడు వరకు ఉన్న షోస్ అన్నీ ఒక లెక్క ఆ ఒక్క షో వచ్చిన తర్వాత ఒక్క లెక్కగా మార్చేసింది ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ అని చెప్పవచ్చు. మొదట పాశ్చర్య దేశాల్లో స్టార్ట్ అయ్యిన ఈ గ్రాండ్ రియాలిటీ షో ఇండియాలో కూడా ఎప్పుడు నుంచో ఉంది.
మెయిన్ గా హిందీలో మొదట స్టార్ట్ అయ్యి అక్కడ గత పద్దెనిమిదేళ్ళుగా కూడా సాగింది. ఇలా ఒకో భాషలో స్టార్ట్ అవుతూ ఎట్టకేలకి తెలుగులో కూడా స్టార్ట్ అయ్యింది. ఇలా తెలుగు మొదలైన మొదటి సీజన్ తోనే టీఆర్పీ రేటింగ్స్ బద్దలయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ తో హోస్ట్ చేసిన ఈ సీజన్ పెద్ద హిట్ అయ్యింది. ఇక ఈ తర్వాత నాచురల్ స్టార్ నాని ఆ తర్వాత కింగ్ నాగార్జునలు హోస్ట్ లుగా చేశారు.

కాగా ఒకో సీజన్ కి కొంచెం కొత్తగానే అనిపించింది కానీ సీజన్ 3 నుంచి నాగార్జున ఒక్కరితోనే ఇప్పుడు వరకు ఎనిమిదో సీజన్ వరకు కంటిన్యూ చేయడం అనేది షో వీక్షకుల్లో కూడా ఒకింత బోర్ అనిపించింది. కానీ నాగ్ తన మార్క్ హోస్టింగ్ తో నెట్టుకొచ్చేసారు కానీ ఇపుడు తన హోస్టింగ్ పై ప్రముఖ నటి అలాగే గత బిగ్ బాస్ సీజన్ లేడీ కాంట్రవర్సియల్ కంటెస్టెంట్ సోనియా ఆకుల కింగ్ నాగార్జునపై సంచలన కామెంట్స్ చేయడం జరిగింది.
నాగార్జున కంటెస్టెంట్స్ విషయంలో అసలు విషయం కాకుండా మరో రకంగా స్టాండ్ తీసుకుంటున్నారని ఆమె చెబుతుంది. తన విషయంలో కూడా నాగ్ వైఖరి పట్ల అసహనం ఆమె వ్యక్తం చేసింది. ఇక నాగ్ బిగ్ బాస్ హోస్ట్ గా ఆపేస్తేనే మంచిది అని తన స్థానంలో రానా దగ్గుబాటి బిగ్ బాస్ హోస్ట్ గా సెట్ అవుతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
అలాగే నాగార్జున కంటే రానా దగ్గుబాటి బాగా మాట్లాడుతాడు అని అందుకే ఈసారి హోస్ట్ గా నాగార్జున కంటే రానా బెటర్ అంటుంది. దీనితో తన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ యువ నటి లేటెస్ట్ గానే కిల్లర్ ఆర్టిస్ట్ అనే సినిమా చేసింది. ఇక ప్రస్తుతం కింగ్ నాగార్జున పలు సినిమాలు సినిమాలు చేస్తున్నారు. అయితే హీరోగా తాను చేయడం లేదు కానీ పలు చిత్రాల్లో సాలిడ్ గెస్ట్ పాత్రలు చేస్తున్నారు.
కాగా తమిళ్ లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా "కూలీ"లో చేస్తుండగా తెలుగులో కూడా ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమా హీరో ధనుష్ అలాగే దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో కుబేర అనే సినిమాల్లో తాను నటిస్తున్నారు. ఇక హీరోగా మాత్రం తన నుంచి ఒక సోలో సినిమా అనౌన్సమెంట్ కోసం అక్కినేని అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











