»   » రానా బెడ్‌రూంలో బల్బులు మార్చడానికి పనికి రాడు.. నానీ ఓ హీరోనా? హీరోల మధ్య గొడవ..

రానా బెడ్‌రూంలో బల్బులు మార్చడానికి పనికి రాడు.. నానీ ఓ హీరోనా? హీరోల మధ్య గొడవ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఐఫా వేడుకల్లో టాలీవుడ్ హీరోలు నానీ, రానా దగ్గుబాటి మధ్య జరిగిన మాటల యుద్దం చర్చనీయాంశమైంది. ఐఫా వేడుకల్లో భాగంగా రూపొందించిన ఆడియో, విజ్వువల్ (ఏవీ) వీడియో కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో రానాపై నానీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఐఫా కోసం ఈ వీడియోను రూపొందించారు. ఆ వీడియోలో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రానాపై నానీ చేసి వ్యాఖ్యలు ఏమిటంటే..

లీడర్, ఘాజీ హిట్లా?

లీడర్, ఘాజీ హిట్లా?

రానా దగ్గుబాటి చేసిన హిట్ సినిమాలు ఏంటో చెప్పమని జర్నలిస్టుకు నానీ ఎదురు ప్రశ్న వేశాడు. దాంతో సదరు జర్నలిస్టు లీడర్, ఘాజీ అని చెప్పగానే అవి సినిమాలా? అవి హిట్లా, వాడు ఆ సినిమాలు చేయకపోతే అవి బ్లాక్ బస్టర్ అని నానీ విరుచుకుపడ్డాడు.

హైట్ ఉంటే బౌన్సర్లవుతారు..

హైట్ ఉంటే బౌన్సర్లవుతారు..

హైట్‌గా ఉన్నంతమాత్రాన హీరోలు అవుతారా? ఎత్తుగా ఉంటే హీరోల పక్కన బౌన్సర్లు అవుతారు. బెడ్రూమ్‌లో రానా బల్బులు మార్చడానికి పనికి వస్తాడు అని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. నానీ చేసిన వ్యాఖ్యలు రానాను మనస్తాపానాకి గురిచేశాయి. దాంతో చేతిలో ఉన్న మైక్ నేలపైకి కొట్టి రానా వేదికపై నుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున షాక్ గురయ్యాడు. రానా వెళ్లిపోయిన వెంటనే వేదికపైకి నానీ వచ్చాడు. రానా ఏదో వీడియో పంపించాడు మనం చూద్దామా అని దానిని ప్లే చేయమని కోరాడు.

నానీ నేచురల్ స్టారా?

నానీ నేచురల్ స్టారా?

వేదిక దిగిన రానాను మరో జర్నలిస్టు స్పందిచమని కోరాగా.. రానా ఈ విధంగా స్పందించాడు. నేచురల్ స్టార్ నానీ గురించి ఏమైనా చెప్పమని కోరగా, నానీ ఏమైనా ఇస్రో పంపిన శాటిలైటా? వాడికి ఏమోచ్చు. వాడు ఏమి చేశాడు.. నాలుగైదు సినిమాలు చేశాడు అంతేగా.. వాడి గురించి ఎంతసేపు, ఏమి చెప్పాలి? అని రానా సీరియస్ అయ్యాడు.

విక్టరీ వెంకటేష్ జోక్యం

విక్టరీ వెంకటేష్ జోక్యం

ఇలా రానా, నానీల మధ్య గొడవ సీరియస్‌గా ఉండటంతో విక్టరీ వెంకటేష్ జోక్యం చేసుకొన్నారు. రానా, నానీలను మధ్య రాయబారం నడిపి వారిని కాంప్రమైజ్ చేశాడు. మీరందరూ చిరంజీవిని, నాగార్జున, బాలయ్యబాబును ఆదర్శంగా తీసుకోవాలని నచ్చచెప్పాడు. దాంతో వారి మధ్య గొడవ సద్దుమణిగింది.

చిరు, నాగ్‌లా పాజిటివ్‌గా ఉండాలి

చిరు, నాగ్‌లా పాజిటివ్‌గా ఉండాలి

ఖైదీ నంబర్ 150తో చిరు కుమ్మేశాడు.. నాగ్ ఇంకా 25 ఏండ్ల కుర్రాడిలా ఉన్నాడు. బాలయ్య సమయం లేదు మిత్రమా అంటే రికార్డులు బ్రేక్ అయ్యాయి. నేను తెల్లగడ్డం పెంచితే ప్రేక్షకులు అభినందించారు. మీరేంటిరా ఇంకా 40 ఏళ్ల మాదిరిగా కనిపిస్తున్నారు. కొంచెం పాజిటివ్‌గా ఆలోచించండి అంటూ వారిద్దర్ని కలిపాడు.

టీవీ రేటింగ్ పెంచడానికేనా

టీవీ రేటింగ్ పెంచడానికేనా

ఐఫా అవార్డుల కార్యక్రమాన్ని రక్తి కంటించడానికి, టెలివిజన్ రేటింగ్‌ను పెంచడం కోసం ఈ వ్యవహారాన్ని వీడియోగా ఓ డ్రామాగా రూపొందించారు. ఈ వ్యవహారమంతా థ్రిలింగ్ ఉన్నప్పటికి.. అసలు విషయం తెలిసిన తర్వాత ఈ షాక్ నుంచి బయటపడటం అభిమానులు, వీక్షకుల వంతు అయింది. రేటింగ్ కోసం ఇలాంటి ట్రిక్కులన ప్రదర్శించడం ఈ మధ్యకాలంలో అలవాటైపోయింది.

English summary
Tollywood Heros Rana Daggubati, Nani shooted allegation on each other. Nani targeted Rana, said that if somebody with hight will become bouncer behind the heroes. they will not become heroes. For this comments, Rana gets angry and said.. Is nani hero in tollywood. what is the great he done in the industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu