For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 5: షో నుంచి నాగార్జున ఔట్.. ఆయన స్థానంలో స్టార్ హీరో.. ఆ అనుభవంతోనే ఒప్పుకున్నాడట

    |

    తెలుగు బుల్లితెర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ షో ఇప్పటికే మన దగ్గర నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇవన్నీ ఒకదానికి మించి ఒకటి విజయవంతం అయ్యాయి. ఈ ఉత్సాహంతోనే త్వరలోనే మేకర్స్ ఐదో సీజన్‌తో ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సీజన్ నుంచి హోస్ట్ అక్కినేని నాగార్జున తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఓ స్టార్ ఎంట్రీ ఇస్తున్నాడట. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

    హాట్ హాట్‌గా ఫర్నాజ్ శెట్టి.. ఇందువదనగా బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్‌తో శృంగారం

    ఏకంగా నాలుగు.. అన్నీ సూపర్ హిట్టే

    ఏకంగా నాలుగు.. అన్నీ సూపర్ హిట్టే

    ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులోకి పరిచయం అయింది. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇది ఆరంభంలోనే మంచి స్పందనను అందుకుంది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అందుకే ఈ షో ఏకంగా ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గానే రన్ అయ్యాయి.

    నాలుగు సీజన్లకు ముగ్గురు హోస్టులు

    నాలుగు సీజన్లకు ముగ్గురు హోస్టులు

    తెలుగులో బిగ్ బాస్ షో అంతలా సక్సెస్ అవడానికి.. దాన్ని ముందుడి నడిపించిన హోస్టులు ప్రధానం కారణం అని చెప్పొచ్చు. నాలుగు సీజన్లను ముగ్గురు స్టార్ హీరోలు అద్భుతంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని, మూడు నాలుగు సీజన్లను నాగార్జున తమదైన శైలి హోస్టింగ్‌తో విజయాన్ని అందించారు. తద్వారా మంచి పేరును అందుకున్నారు.

    మన షోకు జాతీయ స్థాయిలో గుర్తింపు

    మన షోకు జాతీయ స్థాయిలో గుర్తింపు

    బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా పదిహేనేళ్ల క్రితమే హిందీలో బిగ్ బాస్ ప్రారంభం అయింది. ఆ తర్వాత దేశంలోని చాలా భాషల్లోకి ఇది విస్తరించింది. అందులో తెలుగు ప్రసారం అవుతోన్న షోకే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా టీఆర్పీలో రికార్డులను క్రియేట్ చేస్తూ మన షో జాతీయ స్థాయిని అందుకుంది. ఈ క్రమంలోనే గత సీజన్‌లో నేషనల్ రికార్డును సైతం సృష్టించి సత్తా చాటింది.

    ఐదో సీజన్‌ వస్తోంది.. ఆ పనిలో మేకర్స్

    ఐదో సీజన్‌ వస్తోంది.. ఆ పనిలో మేకర్స్

    నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి కావడంతో బిగ్ బాస్ మేకర్లు ఐదో దాని కోసం కూడా పనులు ప్రారంభించేశారు. ఈ ఏడాది కరోనా ప్రభావం కారణంగా షో కొంత ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ ప్రేక్షకులకు మజాను పంచేందుకు వాళ్లంతా ప్లాన్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సెట్ నిర్మాణం.. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలు కూడా ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి.

    సీజన్ నుంచి అక్కినేని నాగార్జున ఔట్

    సీజన్ నుంచి అక్కినేని నాగార్జున ఔట్

    మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభం కాబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇది సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రసారం అవుతుందని ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ షాకింగ్ న్యూస్ కూడా బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్ నుంచి అక్కినేని నాగార్జున తప్పుకున్నారట.

    నాగార్జున స్థానంలో మరో స్టార్ హీరో రాక

    నాగార్జున స్థానంలో మరో స్టార్ హీరో రాక

    రెండేళ్లుగా బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తున్న అక్కినేని నాగార్జున.. ఈ సీజన్‌కు అందుబాటులో ఉండడం లేదని ఓ న్యూస్ బుల్లితెర వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. పలు చిత్రాలను ప్రకటించిన ఆయన.. వాటి కోసమే ఈ నిర్ణయం తీసకున్నారని అంటున్నారు. ఇక, నాగార్జున స్థానంలో టాలీవుడ్ హంక్, స్టార్ హీరో దగ్గుబాటి రానా ఐదో సీజన్‌ను హోస్ట్ చేయబోతున్నాడని కూడా తెలిసింది.

    ఆ అనుభవంతోనే ఈ షోకు గ్రీన్ సిగ్నల్

    ఆ అనుభవంతోనే ఈ షోకు గ్రీన్ సిగ్నల్

    అక్కినేని నాగార్జున తప్పుకున్న తర్వాత బిగ్ బాస్ నిర్వహకులు పలువురు హీరోలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దగ్గుబాటి రానాను ఫైనల్ చేసుకున్నారట. ఈ స్టార్ హీరో గతంలో ‘నెంబర్ వన్ యారీ' అనే షోను హోస్ట్ చేశాడు. ఆ అనుభవంతోనే ఈ సీజన్‌ను నడిపించడానికి ఒప్పుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో!

    English summary
    Bigg Boss is the Telugu Top Rreality TV Series. This Show Completed Four Seasons Successfully. Now Makers Planing for 5th One. This Season Likely to Host by Rana Daggubati.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X