టీవీ సీరియల్‌లో నటించబోతున్న రాణా-క్రిష్
హైదరాబాద్: కృష్ణం వందే జగద్గురుమ్ చిత్ర హీరో రాణా, దర్శకుడు క్రిష్ ఓ టీవీ సీరియల్‌లో నటించబోతున్నారు. అయితే ఇదంతా తమ తాజా చిత్ర పబ్లిసిటీలో భాగమే అని స్పష్టం అవుతోంది. ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం.... ఈ టీవీలో ప్రసారం అవుతున్న 'పుత్తడి బొమ్మ' సీరియల్ లో వీరు గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారు.
పుత్తడి బొమ్మ సీరియల్ 1500వ మెగా ఎపిసోడ్‌కు చేరుకున్న నేపథ్యంలో సీరియల్ నిర్వాహకులు ఈ ఏర్పాట్లు చేసారు. ఇందులో గెస్ట్‌లుగా నటించడం ద్వారా 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం గురించి ప్యామిలీ ప్రేక్షకుల్లో మంచి పబ్లిసిటీ జరిగే అవకాశం ఉండటంతో రాణా-క్రిష్ వెంటనే ఓకే చెప్పారు.
ఫ్యామిలీ ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పించాలంటే తమ సినిమాల గురించి బుల్లితెరపై ప్రమోట్ చేసే ట్రెండ్ తొలుత బాలీవుడ్లో మొదలైంది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు ఎప్పటి నుంచో ఈ ట్రెండ్ కొనసాగిస్తున్నారు. తాజాగా అది టాలీవుడ్ కి కూడా పాకింది. రాణా-క్రిష్ ఈ విషయంలో సక్సెస్ అయితే ఇకపై సీరియళ్లలో సినిమా స్టార్ల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
ఫస్ట్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్ పై నిర్మించిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. నటీనటులు: రాణా, నయనతార, మిలింద్ గునాజీ, కోట శ్రీనివాసరావు, రఘుబాబు, బ్రహ్మానందం, హేమ, ఎల్బీ శ్రీరామ్, నాగినీడు, సత్యం రాజేష్ తదితరులు. ప్రత్యేక గీతంలో వెంకటేష్, సమీరారెడ్డి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. సంగీతం: మణిశర్మ, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: వీఎస్ జ్ఞానశేఖర్, నిర్మాతలు: జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్ రెడ్డి.


Click it and Unblock the Notifications











