ఇక్కడే పెళ్లి చేసుకుందాం.. ఇక్కడే శోభనం.. రానాతో పిచ్చెక్కించేలా చెప్పిన క్రేజీ బ్యూటీ!
Recommended Video

ఈ ఏడాది విడుదలైన సంచలన విజయం సాధించిన చిత్రాలలో ఆర్ఎక్స్ 100 కూడా ఒకటి. ఈ చిత్రం మిగిలిన చిత్రాలన్నింటికంటే భిన్నం. చిన్న చిత్రంగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై పెద్ద విజయం సాధించింది. బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాలకు లభిస్తున్న అద్భుతమైన ఆదరణని సద్వినియోగం చేసుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 చిత్రానికి యువతకు నచ్చేలా రూపొందించారు. ఈ చిత్రంతో దర్శకుడు అజయ్ భూపతి, హీరో కార్తికేయ, పంజాబీ భామ ఓవర్ నైట్ లో క్రేజీ సెలెబ్రిటీలుగా మారారు. వీరంతా కలసి ఇటీవల రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నెం 1 యారీ షోలో పాల్గొన్నారు.

రచ్చ రచ్చ చేశారు
కార్తికేయ, అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ ముగ్గురూ రానాతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ షోలో పంజాబీ పిల్ల పాయల్ రాజ్ పుత్ వచ్చీ రానీ తెలుగులో చెప్పిన మాటలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. పాయల్ రాజ్ పుత్ చెప్పిన డైలాగులకు రానా పగలబడి నవ్వుకున్నాడు.

ఇక్కడే పెళ్లి.. ఇక్కడే శోభనం
ఈ షోలో భాగంగా బెలూన్స్ ఊదుతూ డైలాగ్స్ చెప్పాలి అనే టాస్క్ ని రానా వీరి ముగ్గురికి ఇచ్చాడు. పాయల్ రాజ్ పుత్ తెగ ఇబ్బంది పడిపోయింది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో బాగా అలవాటైన ఓ డైలాగ్ ని చెప్పేసింది. ఇక్కడే పెళ్లి చేసుకుందాం.. ఇక్కడే శోభనం చేసుకుందాం..పిల్లలు కూడా ఇక్కడే అంటూ పాయల్ చెప్పిన డైలాగ్ తో రానాతో పాటు, కార్తికేయ, అజయ్ భూపతి పగలబడి నవ్వుకున్నారు.

బాహుబలి డైలాగ్
పాయల్ రాజ్ పుత్ చేత బాహుబలి చిత్రంలో డైలాగ్ చెప్పించాలని రానా కార్తికేయని కోరాడు. నువ్వు పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ అనే ఫేమస్ డైలాగ్ కార్తికేయ చెబుతాడు. తనకు ఒక్కముక్క కూడా అర్థం కానట్లు పాయల్ చూస్తుంది. దీనితో ఒక్కొక్క పదం ఆమెచేత చెప్పిస్తాడు.

క్రేజీ ఆఫర్స్
ఇక సినిమాల విషయానికి వస్తే దర్శకుడు అజయ్ భూపతికి మంచి అవకాశాలు వస్తున్నాయి. కార్తికేయ కూడా నటుడిగా తానేంటో ఈ చిత్రం ద్వారా నిరూపించుకున్నాడు. ఇక పాయల్ అందాలకు తెలుగు యువత ఫిదా అయిపోయారు. పాయల్ రాజ్ పుత్ రవితేజ తదుపరి చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











