Bigg Boss 7 Telugu: వాళ్లంతా ఎలిమినేట్.. ఆ ఆరుగురికే అస్త్రాలు.. శివాజి ప్లాన్ అదిరిందిగా!
బిగ్ బాస్.. సరికొత్త కాన్సెప్టుతో ప్రసారం అవుతోన్నా.. ప్రేక్షకుల మన్ననలు అందుకుని చాలా తక్కువ సమయంలోనే నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకున్న ఏకైక షో. వేరే భాషల్లోకి ఎప్పుడో వచ్చినా.. తెలుగులోకి మాత్రం ఏడేళ్ల క్రితమే ఇది పరిచయం అయింది. ఆరంభంలోనే ప్రేక్షకుల మనసు దోచుకుని సక్సెస్‌ను అందుకుంది. ఆ తర్వాత ప్రతి సీజన్ కూడా ఒకదానికి మించి ఒకటి విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్ కూడా జనరంజకంగా సాగుతోంది. తాజా ఎపిసోడ్‌లో జరిగిన టాస్క్ ఎలా ముగిసింది అనేది చూద్దాం పదండి!
గతంలో కంటే కొత్త ప్రయోగాలు:బిగ్ బాస్ షో తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. అందుకే నిర్వహకులు వరుసగా సీజన్లను ప్రసారం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో సీజన్‌ను భారీ అంచనాల నడుమ మొదలు పెట్టారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో వస్తున్న ఇందులో గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో ఇది మొదటి నుంచే రసవత్తరంగా సాగుతోంది.

మాయ అస్త్ర.. రెండు టీమ్‌లతో:రెండో వారానికి సంబంధించి 'పవర్ అస్త్ర'ను గెలుచుకోవడం కోసం హౌస్‌లోని కంటెస్టెంట్లకు 'మాయ అస్త్ర' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో అమర్‌దీప్, శివాజి, షకీలా, ప్రియాంక, ప్రిన్స్, శోభా శెట్టిలను రణధీర టీమ్‌గా.. గౌతమ్, ప్రశాంత్, రతికా, దామిని, శుభశ్రీ, తేజలను మహాబలి టీమ్‌గా విభజించారు. ఈ టాస్కుకు సందీప్ సంచాలకుడిగా వ్యవహరించాలని సూచించాడు.
ఫస్ట్ రౌండ్ వాళ్లదే.. రెండోదిలా:'మాయ అస్త్ర' టాస్కులో భాగంగా జరిగిన మొదటి రౌండ్‌లో 'టగ్ ఆఫ్ వార్' పెట్టగా.. రణధీర టీమ్ గెలిచి 'మాయ అస్త్ర'ను గెలుచుకునేందుకు ఓ కీ (తాళం) సాధించింది. దీని తర్వాత ఈ రెండు జట్లకు బిగ్ బాస్ 'మలుపులో ఉంది గెలుపు' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా స్పిన్ వీల్ తిప్పగా అందులో ఎలా వస్తే.. కలర్స్ బోర్డుపై కంటెస్టెంట్లు అలా చేయాల్సి వచ్చింది.
రెండో రౌండ్ ఎలా సాగిందంటే:'మలుపులో ఉంది గెలుపు' టాస్కులో మొదటి రౌండ్‌లో రణధీర టీమ్ సభ్యురాలు ప్రియాంక, గౌతమ్ మీద విజయం సాధించింది. రెండో రౌండ్‌లో మహాబలి టీమ్ సభ్యుడు ప్రశాంత్, శోభా శెట్టిపై గెలిచాడు. నిర్ణయాత్మకమైన మూడో రౌండ్‌లో రతికా రోజ్‌పై ప్రిన్స్ యావర్ విన్ అయ్యాడు. దీంతో రెండో రౌండ్‌లోనూ రణధీర జట్టే గెలిచినట్లు సంచాలకుడు సందీప్ ప్రకటించాడు.
వాళ్లు ఔట్.. వీళ్లకు అస్త్రాలు:రెండు గేమ్స్ ముగియగానే 'మాయ అస్త్ర' టాస్క్ ముగిసిందని బిగ్ బాస్ తెలిపాడు. ఇందులో జరిగిన రెండింటిలోనూ గెలిచిన రణధీర టీమ్ సభ్యులకు ఆరు మాయ అస్త్రాలను అందించాడు. అంతేకాదు, 'పవర్ అస్త్ర' కోసం జరిగే పోటీకి వీళ్లంతా అర్హత సాధించినట్లు చెప్పాడు. ఫలితంగా మహాబలి టీమ్‌లోని ఆరుగురు సభ్యులు ఈ వారం టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు.
శివాజి తెలివితోనే మిగిలారు:'మాయ అస్త్ర' టాస్కులో ఏ టీమ్ గెలిచినా వాళ్లకు లభించిన తాళాన్ని దాచుకోకపోతే తుది దశకు చేరలేదు. ఇది బాగా గ్రహించిన శివాజి తమ జట్టు గెలుచుకున్న తాళాలను సురక్షితంగా ఉంచడంలో సక్సెస్ అయ్యాడు. మహాబలి టీమ్ సభ్యులు ఎంత ప్రయత్నించినా.. తాళాలను కొట్టేయకుండా అడ్డుకున్నాడు. దీంతో అతడిపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











