ఒకప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ‘జబర్దస్త్’ మహేష్ రేంజ్ అదే!

జబర్దస్త్ షోలో ఒకప్పుడు సైడ్ ఆర్టిస్ట్‌గా కనిపించి.. ఆ తరువాత కొంత కాలానికి టీం లీడర్‌గా ఎదిగాడు మహేష్. చివరకు జబర్దస్త్ మహేష్ అనే ట్యాగ్‌ను తెచ్చుకున్నాడు. బుల్లితెరపై తెచ్చుకున్న క్రేజ్‌ను వెండితెరపై వాడుకున్నాడు. ఇప్పుడు జబర్దస్త్ మహేష్‌కు వెండితెరపై ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో మహేష్ దూసుకుపోతోన్నాడు.

జబర్దస్త్ స్టేజ్ నుంచి..

జబర్దస్త్ స్టేజ్ నుంచి..

జబర్తస్త్ స్టేజ్ మీది నుంచి ఎంతో మంది ఆర్టిస్ట్‌లు వెండితెరకు వెళ్లారు. అక్కడ ఫుల్ డిమాండ్‌ ఉన్న ఆర్టిస్ట్‌లుగా మారిపోయారు. ఇంకొందరు హీరోలుగానూ మారారు. అయితే హీరోలు నిలదొక్కుకునేందుకు చాలానే కష్టపడుతున్నారు. కానీ సక్సెస్‌లు మాత్రం రావడం లేదు. అందులో మహేష్ మాత్రం అందరికంటే ముందున్నాడు.

వరుసగా ఆఫర్లు..

వరుసగా ఆఫర్లు..

జబర్దస్త్ మహేష్‌కు ఇప్పుడు వెండితెరపై బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయి. అలా ఆ పాత్ర ఈ పాత్ర అని తేడా లేకుండా అన్ని రకాల క్యారెక్టర్లు పోషించాడు. విలన్‌గానూ మహేష్ మెప్పించాడు. తన ప్రతిభను నిరూపించుకునే క్యారెక్టర్స్ కూడా పడటంతో మహేష్ రెచ్చిపోయాడు.

రంగస్థలంతో దశ తిరిగింది..

రంగస్థలంతో దశ తిరిగింది..

రంగస్థలం సినిమాతో మహేష్ కెరీర్ మలుపు తిరిగింది. రామ్ చరణ్ పక్కనే ఉంటూ లెంగ్తీ రోల్‌లో అదరగొట్టేశాడు. అలా జబర్దస్త్ మహేష్ కాస్తా.. రంగస్థలం మహేష్ అయిపోయాడు. కేవలం ఎమోషనల్ పాత్రలో నటించి ఏడిపించడమే కాకుండా.. విలనీగానూ మెప్పించాడు.

ఫుల్ బిజీగా..

ఫుల్ బిజీగా..

అలా మహేష్ ఇప్పుడు వెండితెరపై ఫుల్ బిజీగా ఉన్నాడు. అంత బిజీగా ఉండటంతో బుల్లితెర, జబర్దస్త్ షోల్లో కనిపించడం లేదు. అయితే తాజాగా సుడిగాలి సుధీర్ స్కిట్‌లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఒకప్పుడు ఈ టీంలలో చిన్న చిన్న పాత్రలు వేసిన మహేష్.. ఇప్పుడు స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చే స్టేజ్‌కు ఎదిగాడు.

 హీరోగా ఎంట్రీ..

హీరోగా ఎంట్రీ..

సుడిగాలి సుధీర్ టీంలో మహేష్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. గెటప్ శ్రీను, రాం ప్రసాద్, సుధీర్ కలిసి వేసిన స్కిట్‌లో మహేష్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మొత్తానికి మహేష్ రూపురేఖలు, యాటిట్యూడ్, వస్త్రాధారణ అన్నీ కూడా మారిపోయాయి. ప్రస్తుతం మహేష్ రేంజ్ మారిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X