twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటిని రేప్ చేసిన నిర్మాత అరెస్ట్

    By Bojja Kumar
    |

    Rape case on TV producer
    ముంబై : మరో నిర్మాత రేప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రేప్ కు గురైన 28 ఏళ్ల నటి పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సదరు నిర్మాతను ముంబైలోని పావాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 2న సంఘటన చోటు చేసుకోగా దాదాపు నెలన్నర తర్వాత నిన్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు విచారణలో ఉన్నందున అటు నిర్మాత పేరుతో పాటు, ఇటు బాధితురాలి పేరును పావాయ్ పోలీసులు బయటకు వెల్లడించలేదు.

    పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం...ఓ టీవీ సీరియల్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్న వ్యక్తి తన బేనర్లో రూపొందుతున్న సీరియల్‌లో నటిస్తున్న 28 ఏళ్ల నటిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నెలన్నర క్రితం సంఘటన జరుగగా భయంతో ఇంతకాలం ఆమె పోలీసులను సంప్రదించలేదు. విషయం భర్తకు తెలియడంతో అతని సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    ఎగ్జిక్యూటివ్ నిర్మాతపై పోలీసులు ఐపిసి సెక్షన్ 342, 376(మానభంగం) మరియు 506(2) (బెదిరింపులు) కింద కేసులు నమోదు చేసారు. బాధితురాలు ఫిర్యాదులోని వివరాల ప్రకారం...డిసెంబర్ 2న సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి 7.30 గంటలకు షూటింగ్ ఉందని చెప్పాడు. జోగేశ్వరి రైల్వే స్టేషన్‌కి వీలైనంత త్వరగా వస్తే బస్ ఆమెను పిక్ చేసుకుంటదని చెప్పాడు. ఆమె జోగేశ్వరి రైల్వే స్టేషన్ కి చేరే లోపే సదరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆమెకు మూడు నుంచి నాలుగు సార్లు ఫోన్ చేసాడు. 7.45 గంటలకు ఆమె అక్కడి చేరుకుని బస్ కోసం ఎదురు చూస్తోంది. అక్కడ బస్ కనిపించక పోగా బైక్ పై వెయిట్ చేస్తూ కనిపించాడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆమె ఆటో రిక్షాలో వస్తానని చెప్పినా....బైక్ పై రావాలంటూ బలవంతం చేసాడు. షూటింగ్ స్పాట్ వెళ్లాక మేకప్ రూం నెం.2కి వెళ్లమని చెప్పాడు. గ్రౌండ్ స్టాఫ్ పని కేటాయించి కొన్ని నిమిషాల తర్వాత మేకప్ రూంలోకి ఎంటరై ఆమెను రేప్ చేసాడు. ఆమె అరవబోగా నీ భర్తను, కూతురిని చంపేస్తానని బెదిరించాడు.

    అయితే షూటింగును సూపర్ వైజింగ్ చేసే ప్రొడ్యూసర్ జమీల్ ఖాన్ మాత్రం అలాంటి సంఘటన ఏమీ జరుగలేదని, ఆమె చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని చెప్పుకొచ్చారు. నిజంగా అలా జరిగి ఉంటే వారు వెంటనే పోలీసులను సంప్రదించే వారు. ఇంతకాలం తర్వాత ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. ఆమె సంఘటన జరిగినట్లు చెబుతున్న సమయంలో షూటింగులోనే ఉంది, ఆమె షూటింగుకు హాజరైన సంతకం, తిరిగి వెళ్లిపోయిన సమయం తమ రికార్డుల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. పబ్లిసిటీ కోసమే నటి, ఆమె భర్త ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

    English summary
    Rape case on TV producer : The Powai police on Friday arrested a former television executive producer of a production house for allegedly sexually assaulting a 28-year-old TV serial actress who works under the same banner on December 2. The victim, though, lodged the complaint only on Wednesday - a month and a half after the alleged crime. The actress said she did not lodge the complaint initially fearing stigma. She filed a complaint after he allegedly started making threatening calls after the production house sacked him based on her husband's complaint.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X