For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘రేప్’ గురించి యాంకర్ రష్మి సంచలన ట్వీట్... ఊరంతా ఊరకుక్కలే!

|
Rashmi Gautam Sensational Tweet Goes Viral || Filmibeat Telugu

మహిళలు, అమ్మాయిల మీద రోజు రోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలకు కారణం వారి వస్త్రధారణే అని కొందరు వాదిస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్ ఫోజ్ చేసే విధంగా చిట్టి పొట్టి దుస్తులు, స్కర్టులు ధరించడం వల్లే పురుషుల్లో అలాంటి దుర్భుద్ధి కలుగుతుందంటూ కొందరు ప్రముఖులు సైతం బహిరంగ ప్రకటనలు చేశారు.

ఇలా వాదిస్తున్న వారిని ఉద్దేశించి తెలుగు యాంకర్ రష్మి గౌతమ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. కారణాలు వెతకడం మానండి, మహిలను లొంగదీసుకోవడానికి టన్నులకొద్దీ కారణాలు ఉన్నాయి. ఇలాంటి అడ్డమైన వాదన ఆపండి అంటూ రష్మి తనదైన శైలిలో ఫైర్ అయ్యారు.

మినిస్కర్టులు రాక ముందు రేప్ వచ్చింది

రేప్ అనేది ఫ్యాన్సీ వర్డ్ కాదు.. దయచేసి ఆ పదాన్ని జోక్‌గా వాడొద్దు. అలాంటివి జరిగినపుడు మహిళలు ఎంతో నరకం అనుభవిస్తున్నారు. ఈ ప్రపంచంలోకి మిని స్కర్టులు రాక ముందే రేప్ వచ్చింది... ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని రష్మి గౌతమ్ చెప్పుకొచ్చారు. రష్మి ట్వీట్ మీద నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

మోసం చేయాలనే ఆలోచన తప్ప.. బాగు చేయాలనే ఆలోచన లేదు

మోసం చేయాలనే ఆలోచన తప్ప.. బాగు చేయాలనే ఆలోచన లేదు

‘బాగా చెప్పారు రష్మీ జీ.. ఎవరిని ఎలా మోసం చేయాలనే ఆలోచన తప్ప.. వాడిని బాగు చేద్దామనే ఆలోచన లేదు. పేరెంట్సే అలా చేస్తుంటే పిల్లలు కూడా అదే దారి ఫాలో అవుతున్నారు. అందుకని ముందు వారి పేరెంట్స్ మారాల్సిన అవసరం ఉంది. వాడికి ఇది తప్పు, అది మంచి అని చెబుతూ పరిశీలిస్తూ ఉండాలి. ' అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.

అందరి కళ్లు తెరిపించావ్

అందరి కళ్లు తెరిపించావ్

చాలా మంచి ట్వీట్ చేశారు. రేప్ జరుగడానికి అమ్మాయిల వస్త్రధారణే కారణం అనే వారి కళ్లు తెరిపించావ్. నీవు చాలా అందమైన హృదయం కలిగి ఉన్నావు. అందుకే ఇలాంటి మంచి పోస్టులు చేస్తున్నావు. వెరీ నైస్... అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

కొన్ని సార్లు అదే రీజన్ కావొచ్చు

కొన్ని సార్లు అదే రీజన్ కావొచ్చు

రేప్ జరుగడానికి మినిస్కర్ట్ రీజన్ కాదు. అయితే కొన్ని సార్లు అది కారణం కావొచ్చు. ఉదాహరణకు మీరు హైదరాబాద్‌లో స్కర్ట్ ధరిస్తే ఎలాంటి సమస్య లేదు. కానీ విలేజ్‌లో ధరిస్తే దాని ప్రభావం మరోలా ఉండొచ్చు అని కొందరు అభిప్రాయ పడ్డారు.

ఊరంతా ఊర కుక్కలే ఉన్నాయి

ఊరంతా ఊర కుక్కలే ఉన్నాయి

‘‘ఊరంతా ఊర కుక్కలే ఉన్నాయి.. జాగ్రత్తగా ఉండమని చెబతాం. మనల్ని మనం రక్షించుకోవడం ముఖ్యం. అలాంటి వారికి దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ చెబుతారు. మీ లాంటి రిచ్ పీపుల్ సొంత కార్లు ఉంటాయి కాబట్టి సేప్‌గా వెళతారు. అందరికీ అలాంటి పరిస్థితి ఉండదు కదా.'' మరొకరు స్పందించారు.

సహజ భద్రత కోల్పోతున్న విషయం తెలుసుకోవడం లేదు

సహజ భద్రత కోల్పోతున్న విషయం తెలుసుకోవడం లేదు

‘‘ఇలా చేయడం స్వాతంత్ర్యం అనుకుంది. కానీ దీని వలన తనకి ఉన్న సహజ భద్రతని కోల్పోతోందని తెలుసుకోలేకపోతోంది ఆధునిక యువతి.'' అంటూ తన రక్షణ కవచం నుంచి బయటకు వచ్చి నిల్చున్న తాబేలు ఫోటోను షేర్ చేస్తూ రష్మికి కొందరు కౌంటర్ ఇచ్చారు.

English summary
"Stop finding reasons.. There are tons of other ways to conquer a women.. Rape is not a fancy word to be used as a joke one who goes thru it knows the horror." Rashmi Gautam tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more