»   » అదంతా ఉత్తుత్తి న్యూసేనట: హరితేజ జబర్దస్త్ ఎంట్రీ

అదంతా ఉత్తుత్తి న్యూసేనట: హరితేజ జబర్దస్త్ ఎంట్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
హరితేజ జబర్దస్త్ ఎంట్రీ పెద్ద రూమర్

నిన్నా మొన్నటివరకూన్ పేద్దగా సెలబ్రిటీ హోదాలేకపోయినా బిగ్ బాస్ షో తో అమాంతం స్టార్ స్టేటస్ వచ్చేసింది హరి తేజ కి. ఆమె చేసిన పాత్రల్లో "అ ఆ" తప్ప మరీ పెద్దగా పేరు తీసుకు వచ్చిన సినిమాలు కూడా ఏమీ లేవు. ఈమధ్య దసరా ఉత్సవాలకి యాంకర్‌ అవతారం ఎత్తడంతో హరితేజ ఇక టీవీ రంగంలో బిజీ అవుతుందనే అభిప్రాయం వచ్చేసింది అందరికీ. పనిలో పనిగా ఆమె ఈటీవీ లో వచ్చే స్టార్ షో "ఎక్స్ట్రా జబర్దస్త్" కి యాంకర్ అవనుందనే రూమర్ కూడా వచ్చింది.

గత కొన్నేళ్ళుగా రియాలిటీ షోలలో టాప్ లో ఉంది జబర్దస్త్. ఈ కామెడీ షోకి కమెడియన్లు చేసే స్కిట్లు ఎంత హిట్టో అనసూయ, రష్మిల గ్లామర్‌ కూడా అంతే ఎస్సెట్టు. హరితేజ ఎంటర్‌టైనర్‌ కావచ్చునేమో కానీ గ్లామర్‌ పరంగా ఆమె అంతగా స్కోర్‌ చేయలేదు. అంతేకాదు అయితే జబర్దస్త్‌ షోకి మాత్రం హరితేజాని ఎవరూ సంప్రదించలేదట. టాప్‌ రేటింగ్స్‌ వచ్చే జబర్దస్త్‌ షోకి ఇప్పుడు మార్పులు చేయాల్సిన అవసరమేమీ లేదన్నది టీవీ విశ్లేషకుల అభిప్రాయం.

 Rashmi Out and Hari Teja in for Jabardasth is Just a Rumour

అందుకే హరితేజని ఈ షోకి తీసుకోవడం లేదని ఖరాఖండీగా తెలిసింది. కాకపోతే హరితేజకి తొందర్లో కొన్ని ప్రముఖ షోలు చేతికి వచ్చే అవకాశముంది. ముఖ్యంగా సుమ లాంటి సీనియర్లు హోస్ట్‌ చేసే కార్యక్రమాలని ఆమె చేతికి ఇచ్చేయవచ్చు. బిగ్‌బాస్‌తో వచ్చిన పాపులారిటీని సినీ రంగంలో కూడా వాడుకోవాలని చూస్తోంది కానీ ప్రస్తుతానికి ఆమెకి సినిమాల్లో అంత చెప్పుకోతగ్గ ఆఫర్లు వస్తోన్న దాఖలాలు లేవు. మరి ఈ పాపులారిటీని ఎలా క్యాష్ చేసుకుంటుందో చూడాలి మరి.

English summary
The Latest News That, Rashmi Out and Hari Teja in for Extra Jabardasth is Just a Rumour
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu