Don't Miss!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్‌ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్‌కు భయపడి ఆ బౌలర్‌పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సీమంతం వేడుకల్లో రష్మీ.. పండంటి బిడ్డ కావాలంటూ సుధీర్‌కు షాకిచ్చింది!!
బుల్లితెరపై రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ అనే టాపిక్ ఎప్పుడూ బోర్ కొట్టదు. మా మధ్య ఏమీ లేదు మొర్రో అని బయట ఎన్ని కబుర్లు చెప్పినా కూడా తెర మీదకు వచ్చేసరికి మళ్లీ రచ్చ చేస్తుంటారు. అలా రష్మీ, సుధీర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులు, అభిమానులు మాత్రం బాగా కనెక్ట్ అవుతుంటారు. అలా జబర్దస్త్ జోడిగా ఈ ఇద్దరూ వందకు వంద మార్కులు కొట్టేశారు. అలా ఈ ఇద్దరూ కలిసి చేసే స్కిట్లు, చేసే ఈవెంట్లు బాగానే క్లిక్ అవుతుంటాయి.
ఏడేళ్లుగా బంధం..
సుధీర్ రష్మీది ఏడేళ్ల నుంచి కొనసాగుతున్న బంధం. జబర్దస్త్ షోలోకి రష్మీ ఎంట్రీ ఇచ్చిన మొదటి నుంచి ఈ ట్రాక్ బాగానే క్లిక్ అయింది. అప్పటి నుంచి సుధీర్ తన స్కిట్లో రష్మీపై పంచ్‌లు వేయడం, మధ్య మధ్యలో రష్మీ కూడా బాగానే సపోర్ట్ ఇవ్వడంతో ఇద్దరూ బాగానే క్లిక్ అయ్యారు. ఏకంగా ఈ ఇద్దరి మీదే ఈవెంట్లు ప్లాన్ చేసేంతగా ఫేమస్ అయ్యారు.
పెళ్లి కూడా చేసేశారు..
రష్మీ సుధీర్ పెళ్లి అంటూ ఎన్నో రోజులు సోషల్ మీడియాలో చెవులకు చిల్లులు పడేలా ఊదరగొట్టారు. మొత్తానికి ఆ పని కూడా వారే దగ్గరుండి చేయించారు. ఎలాగూ సుధీర్ రష్మీ పెళ్లి అనేది హాట్ టాపిక్ కదా అంటూ ఓ రెండు ఈవెంట్లలో అదే కాన్సెప్ట్ పెట్టి ఆ ఇద్దరికి పెళ్లి చేసేశారు. అది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే చేసినా కూడా ఎంతో సహజంగా ఉండటంతో అవి బాగా క్లిక్ అయ్యాయి.
ఎన్నో సార్లు క్లారిటీ..
రష్మీ సుధీర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసిన అభిమానులు జంటగా చూడాలని ఎంతో ఆశపడుతుంటారు. అదే విషయాన్ని ఎన్నో సార్లు క్లారిటీగా చెప్పారు. తాము ఏది చేసినా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసమే చేస్తామని చెప్పుకొచ్చారు. అయినా కూడా అభిమానులు మాత్రం రష్మీ సుధీర్‌ను జంటగా చూసేందుకు ఇష్టపడుతుంటారు.
తాజాగా స్కిట్..
తాజాగా వచ్చిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే అందులో సుధీర్, గెటప్ శ్రీను , రాం ప్రసాద్ వేసిన స్కిట్ కొత్తగా ఉండటంతో అందరూ తెగ షేర్లు చేసేస్తున్నారు. ఆ స్కిట్లో సుధీర్‌కు గర్భం రావడం, సీమంతం వేడుకలు జరపడం ఎంతో వైరల్ అవుతున్నాయి.
పండంటి బిడ్డ..
సుధీర్ నెల తప్పడంతో సీమంతం కూడా చేసేస్తారు..స్టేజ్ మీదే సుధీర్‌ను కూర్చోబెట్టి పసుపు కుంకుమ రాసేస్తుంటారు. ఆ సీమంతం వేడుకల్లో రష్మీ కూడా పాల్గొంటుంది. కానుకలుకూడా తెస్తుంది. అసలు ఎలా నెల తప్పావ్ అంటూ సీక్రెట్‌గా అడుగుతుంది. దీంతో అందరూ నవ్వేస్తారు. చివరకు ఓ పండును చూపిస్తు.. పండంటి బిడ్డను కను అంటూ కౌంటర్ వేసింది.