వైరల్ వీడియో : ‘బుట్టబొమ్మ’లా మారిన రష్మీ.. రొమాంటిక్ స్టెప్పులతో సుధీర్ రచ్చ
బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్‌ది ఎవర్‌గ్రీన్ జంట. ఎన్నేళ్లు అయినా సరే వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. ఇద్దరూ కలిసి చేసే స్కిట్ ఓ లెవెల్‌లో ఉంటే.. ఇద్దరి రొమాంటిక్ స్టెప్పులు, రొమాంటిక్ డైలాగ్స్ ఇంకో రేంజ్‌లో ఉంటాయి. వీరిద్దరి మధ్య అందరూ అనుకుంటున్నట్టుగా ఏమీ లేదని చెప్పినా కానీ రూమర్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా వీరిద్దరూ వేసిన స్టెప్పులు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

బుల్లితెరపై క్రేజ్..
రష్మీ సుధీర్ జంటకు బుల్లితెరపై మామూలుగా క్రేజ్ ఉండదు. గత కొన్నేళ్లుగా జబర్దస్త్ స్టేజ్ మీద వీరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతూనే ఉంది. రష్మీపై పరోక్ష కామెంట్స్ చేయడం, స్కిట్స్‌లో భాగంగా రష్మీని కూడా భాగస్వామ్యం చేయడం, ఆమె కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అవ్వడంతో స్కిట్స్ కూడా ఓ రేంజ్‌లో ఆకట్టుకునేవి.

డ్యాన్స్ షోతో మరింత..
సుధీర్ డ్యాన్స్‌లకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సుధీర్ వేసే స్టెప్పులు, గ్రేస్, స్టైల్ ఢీ షోలో బాగానే వైరల్ అయ్యాయి. ఢీ షోలో సుధీర్ వేసే స్టెప్పులు, ఆయన చేసే కామెడీ మరింతగా ఆకట్టుకుంటుంది. ఇక రష్మీ-సుధీర్ మధ్య జరిగే పోట్లాట, వారిద్దరి మధ్య టాస్కులు బాగానే పేలుతాయి.

బుట్టబొమ్మ స్టెప్పులు..
బుట్టబొమ్మ పాట క్రేజ్ ఖండాలు దాటిపోయింది. బుట్టబొమ్మ స్టెప్పులు, బన్నీ గ్రేజ్, పూజా హెగ్డే అందాలు ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన ఢీ ప్రోమోలో సుధీర్ రష్మీ దుమ్ములేపారు. బుట్టబొమ్మ స్టెప్పులు వేసి ప్రేక్షకులను కట్టిపడేశారు. వీరి పర్ఫామెన్స్‌తో ప్రోమో తెగ వైరల్ అవుతోంది.
Recommended Video

వారు కూడా బతకాలి..
ఈ మధ్య సుధీర్, రష్మీ కలిసి ఓ షోలో పాల్గొన్నారు. మీడియాలో తమపై వచ్చే వార్తలపై ఇద్దరూ స్పందించారు. అలాంటి వాటిని పట్టించుకోమని, వారు కూడా బతకాలి కదా అని చెప్పుకొచ్చారు. తమ మీద అలా రాసుకుంటూ సంపాదించుకుంటున్నారంటే మాకేమీ అభ్యంతరం లేదని, అయితే వ్యక్తిగతంగా కించపరిచే విధంగా రాస్తే ఇబ్బందిగా అనిపిస్తుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











