రాసలీల వీడియో లీక్ చేస్తా, బెదిరింపులు... యాంకర్ రష్మి ఎలా రియాక్ట్ అయ్యారంటే?

Recommended Video

Anchor Rashmi Reacts On A Fan In Social Media | Filmibeat Telugu

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన యాంకర్ రష్మి... సోషల్ మీడియాలో తనకంటూ మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. అందం, టాలెంటుతో సినిమా అవకాశాలు సైతం దక్కించుకుంటూ దూసుకెళుతున్నారు. రష్మి సినిమాలో ఉంటే ఆ మూవీకి వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు.

కెరీర్లో ఎదిగే క్రమంలో కొందరు కావాలని బుదర జల్లడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటివి ఎన్నో ఫేస్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చిన రష్మి తాజాగా సోషల్ మీడియాలో తన గురించి ఓ వ్యక్తి చేసిన బ్యాడ్ కామెంటుకు తగిన సమాధానం ఇచ్చారు.

రష్మి రాసలీలలు అంటూ...

రష్మి రాసలీలలు అంటూ...

రష్మి గురించి బ్యాడ్ కామెంట్స్ చేసిన ఓ వ్యక్తి.... తన వద్ద ఆమెకు సంబంధించిన రాసలీలల ప్రూఫ్స్ ఉన్నాయని, త్వరలోనే వాటిని బయట పెడతాను. రష్మి రాసలీలలు పేరుతో త్వరలోనే వాటిని యూట్యూబ్‌లో విడుదల చేయబోతున్నట్లు బెదిరింపులకు పాల్పడ్డాడు.

దిమ్మ దిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మి

దిమ్మ దిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మి

తనపై ఎవరైనా అసభ్యకరంగా కామెంట్స్ చేస్తే... వారికి తప్పకుండా తగిన సమాధానం ఇచ్చే రష్మి తాజాగా ఆ వ్యక్తికి దిమ్మదిరిగే కౌంటర్ ఇవ్వడం గమనార్హం. నీలాంటి వ్యక్తితో నేను ఇలాగే ప్రవర్తిస్తానంటూ తనదైన శైలి పదజాలం వాడుతూ ఏకిపారేసింది.

అన్నా ఆ ట్వీట్స్ డిలీట్ చేయ్, నీ కాళ్లు మొక్కుతా

అన్నా ఆ ట్వీట్స్ డిలీట్ చేయ్, నీ కాళ్లు మొక్కుతా

రష్మి మీద అసభ్యకామెంట్స్ చేయడంతో ఆమెను అభిమానించే మరొక వ్యక్తి.... స్పందిస్తూ ‘అన్నా రష్మి గురించి చేసిన ఆ నీచమైన ట్వీట్స్ డిలీట్ చేయ్. నీ కాళ్లు మొక్కుతా. నేను ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఇలాంటి ట్వీట్స్ చూడలేక పోతున్నాను. నా కోసం ఆ ట్వీట్స్ డిలీట్ చేయ్' అంటూ కోరడం గమనార్హం.

అలాంటి వారిని పట్టించుకోవద్దన్న రష్మి

అలాంటి వారిని పట్టించుకోవద్దన్న రష్మి

అయితే అలాంటి వ్యక్తులను పట్టించువాల్సిన అవసరం లేదని, ప్రతి చోటా ఇలాంటివారు ఉంటారు అంటూ రష్మి తన అభిమానిని కూల్ చేసే ప్రయత్నం చేశారు. రష్మి ధైర్యం చూస్తుంటే ఇలాంటి మాటలు, ఆరోపణలు గతంలో ఆమె చాలా ఎదుర్కొన్నట్లు స్పష్టమవుతోంది.

ఒక లక్ష ట్రాన్ఫర్ చేయాలంటూ బ్రహ్మాజీ

ఒక లక్ష ట్రాన్ఫర్ చేయాలంటూ బ్రహ్మాజీ

కాగా.. రష్మి ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 5 లక్షలకు చేరుకుంది. ఈ సందర్భంగా నెటిజన్లు ఆమెను విష్ చేస్తూ ట్వీట్స్ చేశారు. దీనిపై బ్రహ్మాజీ స్పందిస్తూ మీ వద్ద ఉన్న ఐదు లక్షల నుంచి నాకు ఒక లక్ష ఆన్ లైన్ ట్రాన్ఫర్ చేస్తారా? అంటూ సరదాగా అడిగారు. దీనికి రష్మి రియాక్ట్ అవుతూ.. ‘ఇవ్వడం కుదరదు... ఇది నాది' అంటూ రిప్లై ఇచ్చారు.

రష్మికి 5 లక్షల ఫాలోవర్స్

రష్మికి 5 లక్షల ఫాలోవర్స్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మి... తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో చాట్ చేస్తూ ఉంటారు. దాదాపు ప్రతి ట్వీటుకు రిప్లై ఇస్తుంటారు. ఆమెను అభిమానించే వారి సంఖ్య, ఫాలో అయ్యే వారి సంఖ్య తాజాగా 5 లక్షలకు రీచ్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X