దారుణమైన వీడియో.. ఇట్లాంటి వాళ్లు ఉంటే ఏంటి పోతే ఏంటి?.. యాంకర్ రష్మీ ఫైర్

యాంకర్ రష్మీ.. ఎంతో సున్నిత మనస్కురాలు. తెరపై ఎంత చలాకీగా కనిపిస్తోందో లోలోపల అంత సున్నితంగా ఉంటుంది. మూగజీవాల పట్ల అమితమైన ప్రేమను కనబరుస్తూ ఉంటుంది. నిత్యం వాటి గురించే పాటుపడుతూ ఉంటుంది. ఎవరైనా మూగజీవాలను హింసిస్తున్నారని తెలిస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది. ఎక్కడైనా జంతువులు ఆకలితో అలమటిస్తున్నాయని తెలిస్తే చాలు వెంటనే వాటిని ఆహారం అందేలా చర్యలు తీసుకుంటుంది. జబర్దస్త్ యాంకర్‌గా ఎంతో ఫేమస్ అయిన రష్మీ.. సోషల్ మీడియాలో సామాజిక సమస్యలపై స్పందిస్తుంటుంది. తాజాగా రష్మీ ఓ దారుణమైన వీడియోపై అసహనం వ్యక్తం చేసింది.

లాక్‌డౌన్‌లో మూగజీవాల తరుపున..

లాక్‌డౌన్‌లో మూగజీవాల తరుపున..

రష్మీకి మూగజీవాలంటే పట్ల ఉండే మక్కువ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీధి కుక్కలపైనా అమితమైన ప్రేమను కనబరుస్తూ ఉంటుంది. మూగజీవాలకు ఎవరైనా హాని చేశారని తన దృష్టికి తీసుకొస్తే.. ట్వీట్ల ద్వారా స్పందిస్తుంది. ఈ మధ్య టిక్ టాక్‌లో మూగజీవాలను హింసించడం జరుగుతూ వస్తోంది. వాటిపైనా రష్మీ గళమెత్తింది.

బకెట్ పట్టుకుని రోడ్లపైకి..

బకెట్ పట్టుకుని రోడ్లపైకి..

కరోనా లాంటి కష్టకాలంలో మూగజీవాలకు ఆహారం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చి.. కుక్కలకు స్వయంగా ఆహారాన్ని అందించింది. స్వచ్చంద సంస్థలతో కలిసి.. మూగజీవాలకు ఆహారాన్ని అందించే కార్యక్రమాలు చేపట్టింది. తమ చుట్టుపక్కల ఉండే జంతువులను జాగ్రత్తగా చూసుకోవాలని అందర్నీ కోరింది.

ప్రతీ సమస్యపై..

ప్రతీ సమస్యపై..

తాజాగా ఓ బాల కార్మిక ఘటనపై యాంకర్ రష్మి స్పందించింది. వాచ్ మెన్ తన కూతురితో క్లాస్ రూమ్‌ను శుభ్రం చేయించిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేమీ సాధారణ అంశంగా చూడకూడదని వీటికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళాన్ని వినిపించాలని కోరింది. ఓ టిక్ టాక్ వీడియోలో కుక్క కాళ్లను కట్టేసి.. చెరువులో పడేయడం లాంటి వికృత చేష్టలు చేశారు కొందరు. వీటిపైనా రష్మీ స్పందిస్తూ ఇలాంటి ఘటనపై చర్యలు తీసుకోవాలని టిక్‌టాక్, పెటాలను కోరింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్..

సోషల్ మీడియాలో వీడియో వైరల్..

గత రెండ్రోజులుగా ఒ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓ గేదెను బండికి గట్టి కొందరు దాన్ని హింసించసాగారు. మితిమీరిన వేగంతో దాన్ని పరిగెత్తించారు. అలా కొంతదూరం పయణించిన గేదె.. ఒక్కసారిగా ఆ బండిని బోల్తా కొట్టించింది. దీంతో ఆ బండిపై ప్రయాణిస్తున్న వారంతా కిందపడ్డారు. ఆ గేదె వీరిని వదిలేసి పరిగెత్తింది.

 ఉంటే ఏంటి పోతే ఏంటి?

ఉంటే ఏంటి పోతే ఏంటి?

ఆ గేదె మనుషులపై ప్రతీకారం తీర్చుకుందని కామెంట్లతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ వీడియోపై రష్మీ స్పందిస్తూ.. ‘వారి జీవితాల పట్ల ఎలాంటి గౌరవం లేదని స్పష్టంగా తెలుస్తోంది.. వీరి ప్రాణాలనే కాకుండా వచ్చిపోయే వారి జీవితాలను కూడా ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నారు. వారి కోసం వారి వారి కుటుంబాలు ఎదురుచూస్తుంటాయి. వీరంతా ఎలా పెరిగారు.. ఇట్లాంటి వాళ్లు ఉంటే ఏంటి పోతే ఏంటి?' అని అసహనం వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X