ఆ యాటిట్యూడే మార్చుకోవాలి.. అవి ఆటబొమ్మలు కావు.. నెటిజన్‌కు రష్మీ సూచన
రష్మీ గౌతమ్ జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెరపై స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. బుల్లితెరపై వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకుని వెండితెరపైనా మెరిసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సైడ్ క్యారెక్టర్స్ చేసిన రష్మీ.. జబర్దస్త్ పుణ్యాన హీరోయిన్‌గా మారింది. అయితే వెండితెరపై మాత్రం రష్మీ అంతగా క్లిక్ కాలేదు. బుల్లితెరపై దక్కిన ఆదరణ.. వెండితెరపై కరువైంది. బుల్లితెరపై దుమ్ములేపే రష్మీ.. సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోషూట్లతో నెటిజన్లను కవ్విస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్..
రష్మీ సోషల్ మీడియాలో ఎంత దూకుడుగా వ్యవహరిస్తుందో అందరికీ తెలిసిందే. నెగెటివ్ కామెంట్స్ చేసే వారిని అంతే స్థాయిలో విమర్శిస్తుంది. ఈ లాక్‌డౌన్ సమయంలో రష్మీ సోషల్ మీడియా వేదికగా చిన్న పాటి యుద్దమే చేసి ఉంటుంది.

పెంపుడు జంతువుల కోసం..
రష్మీకి పెట్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు నెలల లాక్ డౌన్ సమయంలో వాటి ఆకలి తీర్చేందుకు శాయశక్తులా కష్టపడింది. చేతిలో బకెట్ నిండా ఫుడ్ పట్టుకుని రోడ్లపై తిరిగింది. కనబడిన వీధి కుక్కలకు ఆహారాన్ని పంచింది. అటువంటి రష్మీ తాజాగా ఓ నెటిజన్‌కు కొన్ని సూచనలు చేసింది.

నెటిజన్ అభ్యర్థన..
ఓ నెటిజన్.. ‘నేను ఓ కుక్కను పెంచుకోవడం లేదా దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాను. నా స్నేహితుడి పుట్టినరోజు కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎవ్వరైనా ఎక్కడ లభిస్తాయో చెప్పగలరా? ఎలా కొనాలో వివరాలు చెబుతారా?' అంటూ పోస్ట్ చేశాడు.
Recommended Video

రష్మీ సూచనలు..
అలా నెటిజన్ అడగడంతో రష్మీ ఫైర్ అయింది. ఈ మేరకు స్పందిస్తూ.. ‘ఈ యాటిట్యూడ్ అందరూ మార్చుకోవాలి. జంతువులు ఆటబొమ్మలు కావు బహుమతిగా ఇవ్వడానికి. దాదాపు పదిహేనేళ్ల బంధానికి కమిట్‌మెంట్ అది. మెడికల్ ఖర్చులు, ప్రేమ, ఎమోషన్ అన్నింటినీ పెట్టుబడిగా పెట్టాలి. మీ ఫ్రెండ్ ఇవన్నీ భరించగలిగే స్థోమత ఉందో లేదో ఓసారి చెక్ చేసుకోండి. చాలా వాటిలో పెంపుడు జంతువులు ఇలానే రోడ్ల మీద వదిలేస్తున్నారు. అవి వారికి భారంగా మారుతున్నాయ'ని రష్మీ వాపోయింది.


Click it and Unblock the Notifications











