twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఫీలింగ్స్ మనకేనా.. వాటికి ఉండవా? రష్మి గౌతమ్ ఎమోషనల్ పోస్టు

    |

    టాప్ యాంకర్, సినీ నటి రష్మీ గౌతమ్ మాటల్లో కొన్నిసార్లు కరుకుదనం, కాఠిన్యం కనిపించనప్పటికీ.. దయ, జాలి ఎక్కువగానే కనిపిస్తాయి. కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో మూగ జీవాలపై చూపించిన కరుణ సోషల్ మీడియాలో హైలెట్‌గా మారింది. తాజాగా వీధి కుక్కల గురించి వైరల్‌ అవుతున్న వీడియోపై ఆమె చేసిన కామెంట్ అందర్నీ ఆకట్టుకొంటున్నది. రష్మీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    వీధి కుక్కలపై రష్మీ జాలి

    వీధి కుక్కలపై రష్మీ జాలి

    మొదటి నుంచి స్ట్రీట్ డాగ్స్ కానీ... ఇతర మూగ జీవాలపై రష్మీ చూపించే ప్రేమ, దయ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నది. లాక్‌డౌన్ కాలంలో వీధి కుక్కలు, ఇతర జంతువుల కోసం ప్రత్యేకంగా ఆహారం తీసుకెళ్లిన ఆమె వీడియోలు వైరల్ అయ్యాయి.

    లాక్‌డౌన్‌లో స్ట్రీట్ డాగ్స్ కోసం

    లాక్‌డౌన్‌లో స్ట్రీట్ డాగ్స్ కోసం

    ఇక కేవలం ఆహారం విషయంలోనే కాకుండా రష్మీ గౌతమ్ జంతువులను హింసించే విషయంలోనూ కఠినంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. జంతువులను వేధించిన వారిపై యానిమల్ ప్రొటెక్షన్ విభాగంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ నెటిజన్‌ పోస్టు చేసిన వీడియోపై చేసిన కామెంట్ ఆలోచించజేసేలా ఉంది.

    తల్లి ప్రేమ గురించి

    తల్లి ప్రేమ గురించి

    ట్విట్టర్‌లో ఓ నెటిజన్ అన్ని రకాల ప్రేమ అక్కడే మొదలై.. అక్కడే ముగుస్తుందంటూ.. తల్లి ప్రేమ గురించి రాబర్ట్ బ్రోనింగ్ పెట్టిన కొటేషన్ ఉదహరిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టును రష్మీ గౌతమ్, జాన్ అబ్రహం, యాక్టర్ హర్షకు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.

    మానవులకే కాదు.. జంతువులకు కూడా

    మానవులకే కాదు.. జంతువులకు కూడా

    నెటిజన్ చేసిన ట్విట్టర్ పోస్టుపై రష్మీ గౌతమ్ స్పందిస్తూ.. మానవులకే కాదు... జంతువులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అంటూ వీడియోపై కామెంట్ చేసింది. వీడియోలో ఓ వీధి కుక్క ఒకచోట గిన్నెలోని ఆహార పదార్థాన్ని ఎత్తుకెళ్లి తన పిల్లలకు తీసుకెళ్లి పెట్టడం కనిపించింది. తన పిల్లలపై కుక్క చూపించిన ప్రేమను పలువురు నెటిజన్లను ఆకట్టుకొంటున్నది.

    రష్మీ గౌతమ్ పోస్టుపై ప్రశంసలు

    ఇక రష్మీ గౌతమ్ పోస్టుపై నెటిజన్ స్పందిస్తూ.. మీరు లాక్‌డౌన్‌లో మీరు చూపించిన సేవకు ధన్యవాదాలు అని ఒకరు అంటే.. మనకే ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు.. కేవలం డబ్బు, ఎంజాయ్‌మెంట్ తప్పితే అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. జంతువులపై మీ ప్రేమ మా హృదయాలను టచ్ చేసింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

    English summary
    Television top anchor Rashmi gautam reacted on a social media post. She commented on post that, “Motherhood: All love begins and ends there.” —Robert Browning. Rashmi commented that, They have feelings too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X