For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టార్గెట్ హైపర్ ఆది: రష్మీ సంచలన ఆరోపణలు.. అతడి ప్రవర్తన బయట పెట్టడంతో!

  |

  తెలుగు బుల్లితెరపైకి చాలా మంది టాలెంట్ ఉన్న కుర్రాళ్లు ఆర్టిస్టులుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది ఒకడు. ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఆరంభంలోనే తనదైన శైలి పంచులు, ప్రాసలతో ఫేమస్ అయ్యాడు. దీంతో వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను సైతం ఏర్పరచుకున్నాడు. ఫలితంగా కెరీర్ పరంగా దూసుకుపోతోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ షోలో హైపర్ ఆదిపై రష్మీ గౌతమ్ సంచలన ఆరోపణలు చేసింది. అసలేం జరిగింది? ఆ వివరాలేంటో మీరే చూడండి!

  అందరిలో హైపర్ ఆది స్పెషల్

  అందరిలో హైపర్ ఆది స్పెషల్

  సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షోలో ఎంతో మంది కమెడియన్లు టీమ్ లీడర్లుగా పని చేశారు. అయితే, ఈ కామెడీ షో చరిత్రలోనే హైపర్ ఆదిలా పంచులతో వన్ మ్యాన్ షోలు చేసే వాళ్లు మాత్రం లేరనే చెప్పాలి. అంతేకాదు, తక్కువ సమయంలోనే ఎక్కువ ఎపిసోడ్స్ గెలుపొందిన టీమ్ లీడర్‌‌గా అతడికి అరుదైన రికార్డు కూడా ఉంది. అందుకే అతడు స్పెషల్ అయ్యాడు.

  బద్రీ హీరోయిన్ బాత్రూం వీడియో వైరల్: వామ్మో ఇది చూశారంటే షాకే!

  ఆది ఎక్కడున్నా టాప్ ప్లేస్‌లోనే

  ఆది ఎక్కడున్నా టాప్ ప్లేస్‌లోనే

  బుల్లితెరపై మాత్రమే కాదు.. యూట్యూబ్‌లోనూ హైపర్ ఆది స్కిట్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పది నిమిషాల పాటు ఉండే అతడి స్కిట్లో లెక్కపెట్టలేనన్ని పంచులు ఉండడం వల్లే అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతోంది. అతడి స్కిట్ల కోసమే జబర్ధస్త్‌ను చూసే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అందుకే ఆది హవా కనిపిస్తోంది.

  యాక్టర్‌గా.. రైటర్‌గా ఆది స్పీడు

  యాక్టర్‌గా.. రైటర్‌గా ఆది స్పీడు


  టెలివిజన్ రంగంలో తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్న హైపర్ ఆది.. సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా చేశాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. ఇక, అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు డైలాగ్ రైటర్‌గానూ పని చేశాడు. ఇలా అన్నింట్లోనూ స్పీడుగా దూసుకెళ్తోన్నాడు.

  తెలుగు హీరోయిన్ అందాల ఆరబోత: ఆమె డ్రెస్, ఫోజులు చూస్తే!

  జబర్ధస్త్‌కు దూరం.. ఆ షోలలోనే

  జబర్ధస్త్‌కు దూరం.. ఆ షోలలోనే


  ఎన్నో ఏళ్లుగా హైపర్ ఆది బుల్లితెరపై హవాను చూపిస్తున్నాడు. ఇందులో భాగంగానే జబర్దస్త్ సహా ఎన్నో షోలలో భాగం అవుతున్నాడు. అయితే, ఇప్పుడు మాత్రం అతడు బిజీ షెడ్యూల్ కారణంగా షోలకు గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే జబర్ధస్త్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. కానీ, 'ఢీ14', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఈ రెండు షోలు మాత్రమే చేస్తున్నాడు.

  షోలో హైపర్ ఆదికి అవమానం

  షోలో హైపర్ ఆదికి అవమానం

  తెలుగులో తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న హైపర్ ఆది తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నాడు. వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇందులో అతడు అదిరిపోయే స్కిట్లతో నవ్వించాడు. అయితే, ఆఖర్లో మాత్రం హైపర్ ఆదికి కొందరి వల్ల పెద్ద అవమానమే జరిగిపోయింది.

  మాచర్ల నియోజకవర్గం ట్విట్టర్ రివ్యూ: నితిన్ రెండు షాక్‌లు.. అప్పుడే మూవీకి అలాంటి టాక్

  రాం ప్రసాద్.. పరదేశి టార్గెట్

  'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో భాగంగా కొందరి ఫొటోలు పెట్టి.. అందులో నచ్చని వ్యక్తిది చింపవచ్చు.. కాల్చేయవచ్చు అని ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా మొదట ఆటో రాంప్రసాద్ 'ఒక విషయంలో పర్సనల్‌గా హర్ట్ అయ్యా' అని, 'ఒక రీజన్ వల్ల ఇలా చేయాల్సి వస్తుంది' అని పరదేశీలు హైపర్ ఆదిని టార్గెట్ చేశారు. ఇద్దరూ అతడి ఫొటోలను ద్వంసం చేసేశారు.

  Recommended Video

  కార్తికేయ 2 తో చందు మొండేటి సక్సెస్ అయ్యాడా? *Reviews | Telugu OneIndia
  యాంకర్ రష్మీ ఆరోపణలతో

  యాంకర్ రష్మీ ఆరోపణలతో


  ఇక, ఇదే టాస్కులో యాంకర్ రష్మీ కూడా హైపర్ ఆదినే టార్గెట్ చేసింది. 'నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉంటారు అని అడగలేదు. ఎప్పుడు వెళ్లిపోతావు అని అడిగారు' అని ఆరోపణలు చేసింది. దీనికి ఆది కూడా అవును అన్నట్లు తల ఊపాడు. ఇక, ఈ టాస్కులో హైపర్ ఆది ఎవరి ఫొటోను కాల్చుతాడు అన్నది సస్పెన్స్‌గా ఉంచారు.

  English summary
  Jabardasth Comedian Hyper Aadi Paticipated in Sridevi Drama Company Show. Rashmi Gautam Allegations on Him in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X