twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రష్మీ - సుధీర్ పర్సనల్ వీడియో లీక్: అక్కడ కూడా రొమాన్స్.. అది అడగడంతో సిగ్గు పడిపోయింది!

    |

    రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్.. కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెరపై వీళ్లిద్దరూ తమ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటూనే ఉన్నారు. యాంకర్‌గా ఆమె.. కమెడియన్‌గా అతడు తమ తమ రంగాల్లో సత్తా చాటుతూ స్టార్‌డమ్‌ను అందుకున్నారు. అదే సమయంలో జంటగా మరింతగా పాపులర్ అయ్యారు. తరచూ ఏదో ఒక షోలో జోడీగా కనిపించడం ద్వారా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వీళ్లిద్దరి పర్సనల్ వీడియో బయటకు వచ్చింది. దీంతో నిజంగా వీళ్లు ఎలా ఉంటారో తెలిసిపోయింది. ఆ వివరాలు మీకోసం!

     ఇద్దరూ కలిసింది ఆ కామెడీ షోలోనే

    ఇద్దరూ కలిసింది ఆ కామెడీ షోలోనే

    తెలుగు బుల్లితెర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాదరణను అందుకుంటూ దూసుకుపోతోంది జబర్ధస్త్. ఎంతో కాలంగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తోన్న ఈ షో.. ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలాగే, చాలా మందిని ఫేమస్ అయ్యేలా మార్చింది. ఇలా జబర్ధస్త్ ద్వారా పరిచయమై భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకున్నారు రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్.

    వీళ్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటోన్నారు

    వీళ్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటోన్నారు

    యాంకర్‌గా రష్మీ గౌతమ్ తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతుండగా.. సుడిగాలి సుధీర్ మాత్రం కమెడియన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. విడివిడిగా పాపులర్ అయినప్పటికీ.. జంటగా మరింత ఫేమస్ అయిందీ యూట్యూబ్ జోడీ. దీంతో వీళ్లిద్దరి క్రేజ్‌ను క్యాష్ చేసుకోడానికి షోల నిర్వహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ జోడీతో ఎన్నో ఫీట్లు చేయిస్తున్నారు.

     ఎప్పుడూ అదే తీరు.. ట్రెండింగ్ జోడీ

    ఎప్పుడూ అదే తీరు.. ట్రెండింగ్ జోడీ

    కొద్ది రోజులుగా రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ రొమాంటిక్ యాంగిల్‌ను చూపిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒకలా హైలైట్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో తరచూ లవ్ ప్రపోజ్ చేసుకోవడం.. రొమాంటిక్‌గా డ్యాన్స్ చేయడం.. డైలాగులు చెప్పుకోవడం వంటివి చేస్తున్నారు. తద్వారా వీళ్లిద్దరూ తరచూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉన్నారు.

    స్నేహమా.? ప్రేమా.? షో కోసమేనా?

    స్నేహమా.? ప్రేమా.? షో కోసమేనా?

    రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ మధ్య ప్రేమాయణం సాగుతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ వాళ్లు మాత్రం తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చెబుతున్నారు. కానీ, దానికి భిన్నంగా ప్రేమను ఒలకబోస్తున్నారు. దీంతో ప్రేక్షకులు ఈ ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమా.? ప్రేమా.? అన్న దానిపై అయోమయానికి గురవుతున్నారు.

    రష్మీ - సుధీర్ పర్సనల్ వీడియో లీక్

    న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే వారం ప్రసారం కానున్న ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌ను స్పెషల్‌గా ప్లాన్ చేశారు నిర్వహకులు. ఇందులో భాగంగానే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఎన్నో కొత్త అంశాలను చూపించారు. అలాగే, స్కిట్లను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎవరెలా ప్రవర్తిస్తుంటారో చూపించారు. ఈ క్రమంలోనే రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్‌ పర్సనల్ వీడియోనూ ప్లే చేశారు.

    అది అడగడంతో సిగ్గు పడిపోయింది

    అది అడగడంతో సిగ్గు పడిపోయింది

    స్కిట్‌లో భాగంగా.. ‘ఈ వారం మేము ప్రాక్టీస్ చేయలేదు. నీ గురించి ఎవరేం అనుకుంటున్నారో చూపిస్తాం' అని రష్మీ గౌతమ్‌తో అన్నాడు అదుర్స్ ఆనంద్. అందుకు అనుగుణంగానే బుల్లెట్ భాస్కర్ ఆమెను తిట్టడం చూపించాడు. ఆ తర్వాత సుధీర్ దగ్గరకు తీసుకెళ్లగా.. అతడు రొమాంటిక్‌గా పూలతో విష్ చేశాడు. ఆ తర్వాత హగ్ చేసుకోమని అడిగాడు. దీంతో రష్మీ సిగ్గుపడిపోయింది.

    English summary
    Actress Rashmi Gautam, who is known for anchoring on TV show Jabardasth, has opened up on her wedding and link up with Sudigali Sudheer and said that she would prefer to have a baby first and then marry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X