ఏకంగా అలా రెచ్చిపోయిన రష్మీ సుధీర్: చాలా సేపు హత్తుకునే ఉన్న జోడీ.. ఆ సైగలకు అర్థం ఏమిటో!

వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై నటించే వాళ్లకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని గుర్తింపు దక్కుతుందన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా జబర్ధస్త్‌ షోలో పాల్గొనే వాళ్లకు మరింత ఎక్కువ పాపులారిటీ దక్కుతోంది. వీళ్లలో చాలా మంది తమ తమ టాలెంట్లను బయటకు తీసుకు వచ్చి మంచి గుర్తింపును అందుకున్నారు. అయితే, సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ మాత్రం జంటగా ఫేమస్ అయ్యారు. దీనికి కారణం వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందన్న టాక్ రావడమే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జంట మరోసారి రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన వీడియోపై ఓ లుక్కేయండి!

కెరీర్‌లు మొదలైందిలా.. ఒక షోతోనే ఫేమస్

కెరీర్‌లు మొదలైందిలా.. ఒక షోతోనే ఫేమస్

సినిమా నటిగా కెరీర్‌ను ఆరంభించింది హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్. కొన్ని చిత్రాల్లో నటించిన తర్వాత జబర్ధస్త్ షో ద్వారా యాంకర్‌గా పరిచయం అయింది. దీంతో తక్కువ సమయంలోనే పాపులర్ అయింది. మ్యాజిక్ షోలు చేస్తూ తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు సుధీర్. ఆ తర్వాత జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే టీమ్ లీడర్‌గా ఎదిగిపోయి సెలెబ్రిటీగా వెలుగొందుతున్నాడు.

యూట్యూబ్ జోడీగా పేరు.. పెళ్లితో పాపులర్

యూట్యూబ్ జోడీగా పేరు.. పెళ్లితో పాపులర్

తమ తమ విభాగాల్లో సత్తా చాటుతూ బుల్లితెరపై స్టార్లుగా వెలుగొందుతున్నారు యాంకర్ రష్మీ గౌతమ్.. కమెడియన్ సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ షో ద్వారా కలిసి వీళ్లిద్దరూ.. అప్పుడెప్పుడో ప్రేమాయణం సాగిస్తున్నారన్న పుకార్లతో ఫేమస్ అయ్యారు. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. దీంతో వీళ్లకు యూట్యూబ్ జోడీగా పేరు కూడా వచ్చింది.

ఏమీ లేదంటూ... జోడీగా రచ్చ చేస్తున్నారు

ఏమీ లేదంటూ... జోడీగా రచ్చ చేస్తున్నారు

రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ మధ్య వచ్చిన వార్తలు మరో జంటపై రాలేదు. అంతలా వీళ్లిద్దరూ కొన్నేళ్లుగా బుల్లితెరపై సందడి చేస్తున్నారు. దీంతో వీళ్ల బంధంపై పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో తమ మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. కానీ, షో నిర్వహకుల ప్లాన్ల కారణంగా లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు నటిస్తూ అయోమయానికి గురి చేస్తున్నారు.

ప్రేమా దోమ లేదు... కానీ ఆమె వల్ల అంటూ

ప్రేమా దోమ లేదు... కానీ ఆమె వల్ల అంటూ

సుడిగాలి సుధీర్ విషయంలో రష్మీ గౌతమ్ మొదటి నుంచీ స్పష్టతతోనే ఉంది. అతడు తనకు ఫ్రెండ్ మాత్రమేనని చెబుతూనే ఉంది. అయితే, సుధీర్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే, ఇది స్క్రీన్ వరకే అని చెబుతుంటాడు. నిజానికి తనకు ఆఫర్లు రావడానికి, పేరు ప్రతిష్టలు పెరగడానికి యాంకర్ రష్మీనే కారణం అని సుధీర్ ఎన్నో సందర్భాల్లో ఒప్పుకున్నాడు కూడా.

దాని కోసం మరోసారి రెచ్చిపోయిన కపుల్

దాని కోసం మరోసారి రెచ్చిపోయిన కపుల్

తరచూ ఏదో ఒక రొమాంటిక్ యాక్ట్ చేసి వార్తల్లో నిలుస్తున్నారు యాంకర్ రష్మీ గౌతమ్.. కమెడియన్ సుడిగాలి సుధీర్. ఇలాంటి సమయంలోనే తాజాగా మరోసారి వీళ్లిద్దరూ జంటగా రెచ్చిపోయారు. డ్యాన్స్ రియాలిటీ షో ఢీ 13లో రెండు టీమ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తోన్న వీళ్లిద్దరూ వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కోసం రొమాంటిక్ డ్యాన్స్ చేసి మైమరపించేశారు.

చాలా సేపు హత్తుకునే.. ఆ సైగలకు అర్థం

చాలా సేపు హత్తుకునే.. ఆ సైగలకు అర్థం

తాజాగా విడుదలైన ఢీ ప్రోమోలో రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ జంటను బాగా ఫోకస్ చేశారు. ఇందులో వాళ్లిద్దరూ కలిసి 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే'లోని ఓ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ సమయంలో ఒకరినొకరు హత్తుకుని అలా చాలా సమయం పాటు ఉండిపోయారు. సరిగ్గా అప్పుడే తన వేళ్లతో రష్మీ.. సుధీర్‌కు సైగలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X