For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కరోనా టైమ్‌లో సుధీర్‌తో రష్మీ అలాంటి పని: అందుకే ఒప్పుకున్నా అంటూ షాకిచ్చిన యాంకర్

  |

  తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా సందడి చేస్తోన్న జంటల్లో సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ జోడీ ఒకటి. జబర్ధస్త్ అనే షో ద్వారా కలిసిన వీళ్లిద్దరూ దాదాపు ఐదారేళ్లుగా బుల్లితెరపై మజాను పంచుతున్నారు. తద్వారా బెస్ట్ జోడీ అనిపించుకుంటున్నారు. దీంతో ఈ కపుల్‌ను వాడుకోడానికి పలు షోల నిర్వహకులు సరికొత్త టాస్కులతో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో రొమాంటిక్ యాక్టులు చేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్‌తో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  Anchor Rashmi Gautam Tested Coronavirus Positivie
  రష్మీ గౌతమ్ అలా.. సుధీర్ ఇలా

  రష్మీ గౌతమ్ అలా.. సుధీర్ ఇలా

  కెరీర్ ఆరంభంలోనే ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది రష్మీ గౌతమ్. ఈ క్రమంలోనే జబర్ధస్త్ అనే షో ద్వారా బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలా ఎంటరైన తక్కువ సమయంలోనే ఎంతగానో పాపులర్ అయింది. ఇక, సుడిగాలి సుధీర్ కమెడియన్‌గా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడు కూడా తక్కువ సమయంలోనే అద్భుతమైన టాలెంట్‌తో టీమ్ లీడర్ అయిపోయాడు.

  ఇద్దరి మధ్య లవ్ ట్రాక్.. వివాహం

  ఇద్దరి మధ్య లవ్ ట్రాక్.. వివాహం

  జబర్ధస్త్ షోలో యాంకర్‌గా రష్మీ గౌతమ్.. కమెడియన్‌గా సుడిగాలి సుధీర్ కలిసి పని చేస్తున్నారు. అలాగే, ‘ఢీ' షోలోనూ వేరే వేరు టీమ్‌లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఈ జంట మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో రష్మీ సుధీర్ బుల్లితెర ఫేమస్ జంట అయ్యారు.

   వీళ్ల క్రేజ్‌ను వాడేస్తోన్న దర్శకులు

  వీళ్ల క్రేజ్‌ను వాడేస్తోన్న దర్శకులు

  రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే అవి ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. దీనికి కారణం వీళ్లిద్దరూ రొమాన్స్ చేస్తుండడమే. అసలు వీళ్లిలా ఫేమస్ అవడానికి షో నిర్వహకులు పెడుతోన్న రొమాంటిక్ స్కిట్‌లే కారణమని చెప్పొచ్చు. ఇలా పెళ్లి చేసుకోవడం వల్లో.. హగ్గులు ఇచ్చుకోవడం వల్లో వీళ్లకు ప్రేమ జంటగా పేరొచ్చింది.

   ఫ్యాన్స్‌లో అయోమయం.. క్లారిటీ

  ఫ్యాన్స్‌లో అయోమయం.. క్లారిటీ

  తరచూ జంటగా రొమాన్స్ చేస్తుండడంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని అంతా అనుకుంటున్నారు. అయితే, అటు సుధీర్.. ఇటు రష్మీ తమ మధ్య అలాంటి రిలేషన్ లేదని మొత్తుకుంటున్నారు. ఎన్నో సందర్భాల్లో తమ బంధం గురించి బహిరంగంగానే ఖండన ఇచ్చారు. కానీ, అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడంతో ఇరువురి ఫ్యాన్స్ అయోమయం అవుతున్నారు.

  కరోనా టైమ్‌లో ఇద్దరు లాంగ్ డ్రైవ్

  కరోనా టైమ్‌లో ఇద్దరు లాంగ్ డ్రైవ్

  సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్‌ను కలిపి ఏదైనా స్కిట్ చేస్తే.. ఆరోజు టీఆర్పీ రేటింగ్ భారీగా వస్తుంది. ఇది ఎన్నో సందర్భాల్లో నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం జరగనున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌లో వీళ్లిద్దరూ జంటగా కనిపించారు. అంతేకాదు, రష్మీ లాంగ్ డ్రైవ్‌కు వెళ్తున్నట్లు చేయగా.. ఆమెతో పాటు సుధీర్‌ కూడా వెళ్లాడు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అయిపోతోంది.

  అందుకే ఒప్పుకున్నానంటూ షాక్

  స్కిట్‌లో భాగంగా రష్మీ గౌతమ్ లాంగ్ డ్రైవ్ వెళ్తున్నట్లు స్టేటస్ పెట్టుకుంటుంది. దీన్ని చూసిన సుధీర్ ప్లాన్ ప్రకారం ఆమె రూట్లోకి వెళ్లి కారులో ఎక్కుతాడు. వీళ్లిద్దరూ హాయిగా వెళ్తుండగా.. మధ్యలో కొమరక్క వచ్చి నా బర్రె పిల్ల తప్పిపోయింది నేనూ వస్తా అంటుంది. అప్పుడు సుధీర్ వద్దనగా.. రష్మీ ‘నాకు జంతువలంటే ఇష్టం. అందుకేగా నిన్ను ఎక్కించుకున్నా' అంటూ అతడికి షాకిచ్చింది.

  అదే చూస్తున్నానని సుధీర్ బిస్కెట్

  అదే చూస్తున్నానని సుధీర్ బిస్కెట్

  అలా వీళ్లిద్దరూ కారులో లాంగ్ డ్రైవ్ వెళ్తుండగా.. మధ్య మధ్యలో రొమాంటిక్ డైలాగులు జోడించారు. ‘అటూ ఇటూ చూడు సుధీర్ ప్రపంచం కనిపిస్తుంది' అని రష్మీ గౌతమ్ అంటుంది. అప్పుడు సుధీర్.. రష్మీ వైపు తీక్షణంగా చూస్తూ.. ‘నేను ప్రపంచాన్నే చూస్తున్నాను' అంటూ సమాధానం చెబుతాడు. దీంతో ఆమె తెగ సిగ్గు పడిపోతుంది. అప్పుడు ఓ రొమాంటిక్ సాంగ్‌ను వేశారు.

  English summary
  Tollywood Actress, Anchor Rashmi Gautam Doing Jabardasth Show. Now She Went Long Drive with Sudigali Sudheer in Jabardasth Skit.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X