ప్రతీ ఏడాది కచ్చితంగా అలా చేస్తా.. వద్దని అమ్మ వార్నింగ్.. రష్మీ కామెంట్స్
జబర్దస్త్ యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బుల్లితెరపై అందచెందాలతో ఎంతగా ఆకట్టుకుందో వెండితెరపైనా అందాలను ఆరబోసి ప్రేక్షకులను కట్టిపడేసింది. జబర్దస్త్ తెచ్చిన క్రేజ్, ఫేమ్‌ను మళ్లీ వెండితెరపై వెలగాలని ప్రయత్నించింది. అయితే రష్మీ ప్రయత్నాలు మాత్రం సఫలం కాలేదు. ఆమె అందాల ఆరబోతకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే బుల్లితెరపై రష్మీకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

మూగ జీవాలపై ప్రేమ..
రష్మీకి మూగజీవాలపై ప్రేమ ఎక్కువ. ఈ సంగతి ఆమెను ఫాలో అయ్యే ఫ్యాన్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆమె రోజులో పది ట్వీట్స్ చేస్తూ.. అందులో తొమ్మది మూగ జీవాల గురించే ఉంటుంది. వారిని జాగ్రత్తగా చూసుకోండని, ఆహారం అందించండని అందర్నీ కోరుతూ ఉంటుంది.
కరోనా వేళ పెట్స్ కోసం రష్మీ..
కరోనా వేళ మూగ జీవాలకు ఆహారం సరిగా అందడం లేదు. రష్మీనే స్వయగా రంగంలోకి దిగింది. బకెట్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ.. వీధికుక్కులకు ఆహారాన్ని పంచుతూ ఉంది. చివరకు పుట్టినరోజు సందర్భంగా కూడా పెట్స్‌తోనే గడిపింది.

పుట్టినరోజు వేడుక..
రష్మీ పుట్టిన రోజు (ఏప్రిల్ 27)న సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే బర్త్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకుందో, ఎలా గడిపిందో తెలుపుతూ ఓ వీడియోను తాజాగా షేర్ చేసింది. ప్రతీ పుట్టినరోజున అమ్మతో గడపుతునాని, ఎక్కడున్నా సరే సాధ్యమైనంత వరకు అమ్మ దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. అలా కుదరకపోతే ఆల్టర్నేటివ్ ఇయర్స్‌లోనైనా అమ్మతోనే పుట్టినరోజను జరుపుకుంటానని తెలిపింది.

వద్దని వార్నింగ్..
లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే పుట్టినరోజును జరుపుకుంటున్నానని తెలిపింది. అయితే బయటి నుంచి తనకు కేక్ తీసుకొస్తామని కొందరు చెప్పారు కానీ.. అమ్మ మాత్రం వద్దని వార్నింగ్ ఇచ్చింది. డెలీవరి బాయ్ వల్ల కరోనా వ్యాప్తి చెందిందని, అందుకే వద్దని చెప్పి.. ఇంట్లోనే తనకోసం స్పెషల్ కేక్‌ను తయారు చేసిందని తెలిపింది.


Click it and Unblock the Notifications











