యాంకర్ అనసూయకు రష్మీ గౌతమ్ ఎమోషనల్ మెసేజ్.. ఎందుకంటే
తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ అనుసరిస్తుంటారు. వారు తమ జీవితంలోని, ప్రొఫెషనల్ జీవితంలోని విషయాలను అభిమానులతో పంచుకొంటారు. అలాగే టాప్ యాంకర్ల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయనేందుకు చాలా సందర్భాలు ఉదాహరణగా నిలిచాయి.
తాజాగా యాంకర్, యాక్టర్ అనసూయ గురించి యాంకర్ రష్మీ గౌతమ్ పెట్టిన ఎమోషనల్ కామెంట్ ప్రతీ ఒక్కరిని కదలించింది. మే 15న యాంకర్ అనసూయ బర్త్ డే. తనకు ఇష్టమైన అనసూయ జన్మదినం రోజున తన ఇన్స్‌టాగ్రామ్‌లో రష్మీ ఓ కామెంట్ ఫెట్టింది.

నీ జీవితం చాలా సంతోషంగా సాగిపోవాలి. నీ జీవితంలో ఎన్నో క్రేజీ మూమెంట్లు రావాలి. నీ జీవితం ఇప్పటికంటేమరింత పర్‌ఫెక్ట్‌గా మారాలి. ముందు ఎన్నో మంచి విషయాలు నీ జీవితంలోకి రావాలి. మెరుగైన జీవితాన్ని నీవు పొందాలని ఆశిస్తున్నాను. జీవితం మొత్తం మరింత సంతోషంగా ఉండాలని కోరుకొంటున్నాను అని రష్మీ గౌతమ్ ఓ పోస్టు పెట్టారు.
యాంకర్లు రష్మి, అనసూయ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైన కూడా రాణిస్తున్నారు. రంగస్థలం లాంటి సినిమాలు అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టగా.. కొన్ని సినిమాలు రష్మీని సిల్వర్ స్క్రీన్ మీద గ్లామర్ హీరోయిన్‌గా ముద్రవేశాయి.


Click it and Unblock the Notifications











