Don't Miss!
- News Lok Sabha Election 2024 Polling LIVE Updates: అతిపెద్ద పండగకు తొలి ఘట్టం..
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ అమ్మాయిలే కాదు.. వాళ్లు కూడా కావాలనుకుంటున్నారు: ప్రదీప్ పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన రష్మీ
చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ప్రతి దానిని వన్ మ్యాన్ షోగా మార్చేసుకుంటూ సత్తా చాటుతోన్న అతడు.. వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అదే సమయంలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు. దాదాపు పదేళ్లుగా టెలివిజన్ రంగంలో తన హవాను చూపిస్తున్న అతడు.. ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రదీప్ పర్సనల్ సీక్రెట్‌ను రివీల్ చేసింది తోటి యాంకర్ రష్మీ గౌతమ్. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!
అలా మొదలైన కెరీర్.. టాప్ యాంకర్‌గా
ప్రముఖ ఎఫ్ఎస్ సంస్థలో రేడియో జాకీగా కెరీర్‌ను ఆరంభించాడు ప్రదీప్. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారం అయిన ఓ గేమ్ షో ద్వారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'గడసరి అత్త సొగసరి కోడలు' అనే షోతో బ్రేక్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోని అతడు.. వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. దీంతో టాప్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు.
యాంకర్‌గానే కాదు.. ఈ సినిమాలు చేసి
తెలుగు బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో సత్తా చాటుతోన్న ప్రదీప్.. ఎన్నో షోలలో చేస్తూ తన హవాను చూపిస్తున్నాడు. అదే సమయంలో కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది', అల్లు అర్జున్ 'జులాయి', నాగ చైతన్య '100% లవ్', ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' వంటి చిత్రాలు అతడికి పేరు తెచ్చాయి.
హీరోగా ఎంట్రీ.. అంచనాలు పెంచేసిన పాట
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు యాంకర్ ప్రదీప్. మున్నా అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్వీ బాబు నిర్మించారు. 'నీలి నీలి ఆకాశం' అనే పాటతో రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేసిన ప్రదీప్.. సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇక, ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.
మిక్స్డ్ టాక్.. కలెక్షన్లు మాత్రం భారీగానే
ఎన్నో అంచనాల నడుమ ప్రదీప్ నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మిశ్రమ స్పందనే వచ్చింది. మొత్తంగా ఓ సారి చూసే సినిమానే అంటున్నారు. ఇక, ప్రదీప్ నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. టాక్ ఎలా ఉన్నా ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా రూ. 1.70 కోట్ల షేర్ వచ్చింది.
ప్రదీప్‌పై రష్మీ గౌతమ్ హాట్ కామెంట్స్ వైరల్
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' విడుదల సందర్భంగా యాంకర్ రష్మీ ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడింది. ఈ సందర్భంగా ప్రదీప్‌పై బోల్డ్ కామెంట్స్ చేసింది. 'ప్రదీప్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. చాలా మంది అతని లాంటి భర్త దొరకాలి కోరుకుంటారు. కేవలం అమ్మాయిలే కాదు.. 30 ప్లస్.. 40 ప్లస్ ఉన్న ఆంటీలు కూడా ప్రదీప్ లాంటి అల్లుడు దొరకాలనుకుంటారు' అని చెప్పింది.
Recommended Video
ప్రదీప్‌పై ఉన్న ప్రేమకు అసలు కారణమిదే
జనాల్లో ప్రదీప్‌పై ప్రేమ పెరగడానికి కారణం చెబుతూ.. 'ప్రదీప్ వందలాది స్టేజ్‌ల మీద పెర్ఫామ్ చేసి ఉన్నాడు. అతనిలో స్పెషాలిటీ ఏంటి అంటే.. జనంలోకి వెళ్లి షో చేయడం. దాని వల్ల అతనికి బోలెడు మంది రియల్ ఫ్యాన్స్. ప్రతి ఒక్క ఇంటి మెంబర్ అయ్యాడు. అతని సినిమా జనంలోకి బాగా వెళ్లింది అంటే.. ప్రదీప్ పట్ల వారికి ఉన్న ప్రేమ అలాంటిది' అంటూ వివరించింది రష్మీ.