For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాక్‌కు గురి చేస్తున్న రష్మీ తీరు.. రహస్యంగా పొలాల్లోకి హాట్ యాంకర్.. ఆశ్చర్యంలో ఇండస్ట్రీ.!

  By Manoj
  |

  బుల్లితెరపైకి ఎంతో మంది యాంకర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మందే నిలదొక్కుకోగలిగారు. అలాంటి వారిలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ.. అనతి కాలంలోనే అత్యంత భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నో ఆఫర్లను దక్కించుకుంటోంది. తాజాగా రష్మీ రహస్యంగా పొలాల్లో చేసిన ఓ పని బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో మీరూ చూడండి.!

  ఈ ఒక్క దానికే పరిమితమైన రష్మీ

  ఈ ఒక్క దానికే పరిమితమైన రష్మీ

  ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న యాంకర్లలో చాలా మంది పలు షోలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అదే సమయంలో వచ్చిన ఆఫర్లకు తగినట్లుగా చానెళ్లను కూడా మార్చేస్తున్నారు. అయితే, రష్మీ గౌతమ్ మాత్రం ఒకే చానెల్‌కు పరిమితం అయింది. అందులో ప్రసారం అవుతోన్న ‘జబర్ధస్త్‌'తో పాటు డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ'లోనూ ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

  హాట్ యాంకర్‌కు అన్నీ ఎక్కువే

  హాట్ యాంకర్‌కు అన్నీ ఎక్కువే

  మిగిలిన యాంకర్ల మాదిరిగా వేరే చానెళ్ల వైపు చూడని రష్మీ గౌతమ్‌కు రెమ్యూనరేషన్ భారీగా అందుతోందని ప్రచారం జరుగుతోంది. జబర్ధస్త్‌కు మరో యాంకర్‌గా ఉన్న అనసూయకే ఎక్కువ పారితోషికం ఇస్తున్నారని అంతా అనుకుంటున్నారు. అయితే, ఆమె కంటే రష్మీనే ఎక్కువగా చార్జ్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమె రేంజ్ బయట పడుతోంది.

  అక్కడ మాత్రం దారుణంగా ఫెయిల్

  అక్కడ మాత్రం దారుణంగా ఫెయిల్

  రష్మీ గౌతమ్ చేసేది తక్కువ షోలే అయినా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంది. అయితే, సినిమాల్లో మాత్రం ఆమెకు అంతగా కలిసి రావడం లేదు. ఆమె నటించిన ఎన్నో సినిమాలు దారుణమైన ఫలితాన్ని అందుకున్నాయి. ఒక్క ‘గుంటూరు టాకీస్' మాత్రం పర్వాలేదనిపించింది. ఈ సినిమా క్రెడిట్ మొత్తం హాట్ యాంకర్‌కే దక్కింది.

  సుధీర్‌తో లవ్ ట్రాక్.. పెళ్లి పీటలెక్కారు

  సుధీర్‌తో లవ్ ట్రాక్.. పెళ్లి పీటలెక్కారు

  యాంకర్‌గా, యాక్టర్‌గా ఫుల్ బిజీగా ఉన్న రష్మీ గౌతమ్.. భారీ స్థాయిలో పాపులారిటీని దక్కించుకోవడం వెనుక జబర్ధస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ కూడా కారణమే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నేళ్లుగా వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని, పెళ్లి కూడా చేసేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ జంటపై యూట్యూబ్‌లో ఎన్నో కథనాలు వచ్చాయి.

  షాక్‌కు గురి చేస్తున్న రష్మీ గౌతమ్ తీరు

  షాక్‌కు గురి చేస్తున్న రష్మీ గౌతమ్ తీరు

  సినిమాల్లో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతోన్న రష్మీ తాజాగా చేసిన ఓ పని బయటకు వచ్చింది. ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ప్రకారం.. ఒడిశాలోని ఓ ప్రాంతంలో ఆమె వంద ఎకరాల సాగు భూమిని కొనుగోలు చేసిందట. దీని విలువ దాదాపు రూ. 5 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. రష్మీ.. ఒకేసారి ఇంత మొత్తంలో భూమి కొనడం చర్చనీయాంశం అవుతోంది.

  Rashmi Gautam Supports Sreemukhi || శ్రీముఖి కి రష్మీ సపోర్ట్ !
  పక్క రాష్ట్రంలోనే ఎందుకు కొన్నదో తెలుసా.?

  పక్క రాష్ట్రంలోనే ఎందుకు కొన్నదో తెలుసా.?

  కొద్ది రోజుల క్రితం రష్మీ పంట పొలాల్లో దిగిన ఫొటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తనకు పచ్చని పొలాలంటే ఇష్టమని చెప్పింది. ఇందులో భాగంగానే ఇప్పుడు భారీగా భూముల కొన్నది. ఇంతకీ ఆమె ఒడిశాలోనే పొలాలు కొనడానికి కారణం.. అక్కడ బంధు వర్గం ఉండడమేనని సమాచారం. వాళ్ల సూచన మేరకే రష్మీ ఈ నిర్ణయం తీసుకుందని టాక్.

  English summary
  Actress Rashmi Gautam, who is known for anchoring on TV show Jabardasth, has opened up on her wedding and link up with Sudigali Sudheer and said that she would prefer to have a baby first and then marry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X