జీవితమంటే అదే.. తిండి కోసం బతికే దాన్ని కాదు.. జబర్దస్త్ యాంకర్ సెన్సేషనల్ కామెంట్స్

జబర్దస్త్ యాంకర్‌గా ఎంతో ఫేమస్ అయింది రష్మీ. అంతకు ముందు వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో మెరిసినా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. జబర్దస్త్ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన తరువాత.. ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకుంది. బుల్లితెరపై వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ వెండితెరపై జిగేల్ మంటూ మెరిసింది. అయితే వెండితెరపై మాత్రం అంతగా ఫేమస్ కాలేకపోయింది. తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన రష్మీ.. అనేక విషయాలను వెల్లడించింది. అవేంటో ఓ సారి చూద్దాం.

రెండు కిలోలు పెరిగాను..

రెండు కిలోలు పెరిగాను..

లాక్ డౌన్ సమయంలో మీరు ఎలాంటి డైట్‌ను ఫాలో అవుతున్నారు.. మాక్కూడా చెప్పండి ఎంతో మందికి సాయం చేసిన వారవుతారని ఓ నెటిజన్ అడగ్గా.. నేను రెండు కిలోలు పెరిగాను.. దీన్ని బట్టే మీకు అర్థం కావాలి నేను ఎలాంటి డైట్‌ను ఫాలో అవ్వడం లేదని అంటూ సమాధానం ఇచ్చేసింది.

సిల్లీ ప్రశ్నలకు సింపుల్ సమాధానాలు..

సిల్లీ ప్రశ్నలకు సింపుల్ సమాధానాలు..

అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఉందా? అనే ప్రశ్నకు.. నాకు లేదు మా అమ్మకు ఉందంటూ ఆన్సర్ ఇచ్చింది. బ్లాక్ ఇష్టమా పింక్ ఇష్టమా? అని అడిగితే... హాట్ పింక్ అంటే ఇష్టమని సమాధానమిచ్చింది. ఈ మధ్య గ్లామర్ బాగా వచ్చింది.. ఏ సబ్బును వాడతారో చెప్పండని అడిగితే.. ఫ్రీ క్లీనర్ అంటూ సమాధానమిచ్చింది.

జీవితమంటే అది..

జీవితమంటే అది..

మీ దృష్టిలో జీవితమంటే ఏంటి ? అని రష్మీని ప్రశ్నిస్తే.. మన కుటుంబం, మన ఏడు తరాల గురించి మాత్రమే కాకుండా సమాజానికి, పుట్టిన గడ్డకు ఏదైనా చేయడం, ఆలోచించడమే జీవితం అంటూ అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

Recommended Video

Anchor Sreemukhi About Her Movie Career
తిండికోసం బతికే దాన్ని కాదు..

తిండికోసం బతికే దాన్ని కాదు..

వంట వండటం ఇష్టమా? అని ఓ నెటిజన్ అడగ్గా.. నాకు ఇష్టం ఉండదు.. టైమ్‌కు తినడం మాత్రమే తెలుసనని చెప్పింది. వండటం నేర్చుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది అంటూ మరో నెటిజన్ కామెంట్ చేయగా.. తిండి కోసం బతికే బ్యాచ్ కాదు.. నాకు బతికేందుకు సరిపడా నైపుణ్యం ఉంది.. అంటే వంట చేయడం వచ్చు అనే. ప్రస్తుతం ప్రపంచం అంతా ఆహారం కోసమే పరితపిస్తోంది.. బతకడం కోసం తిను.. తినడం కోసమే బతకకు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X