Just In
- 36 min ago
బాక్సాఫీస్ ఫైట్: అల్లుడు అదుర్స్ vs రెడ్.. థియేటర్స్ కోసం గొడవలు.. చివరికి ఎంత రాబట్టారంటే?
- 43 min ago
RED Movie Day 1 Collections: రికార్డు స్థాయిలో వసూల్ చేసిన రామ్.. ఫస్ట్ డే ఎంత రాబట్టాడంటే!
- 1 hr ago
అభిజీత్‌కు రోహిత్ శర్మ కానుక: ఏకంగా ఆస్ట్రేలియా నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన టీమిండియా క్రికెటర్!
- 2 hrs ago
Master Movie Day 2 Collections: మాస్టర్‌కు భారీ షాక్.. తెలుగులో మాత్రం ఊహించని విధంగా!
Don't Miss!
- Finance
విలువలేదు: బిట్ కాయిన్, టెస్లా జంప్‌పై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు
- News
ఈసారి విదేశీ అతిధుల్లేకుండానే రిపబ్లిక్ డే- బోరిస్ జాన్సన్ దూరం- 1966 తర్వాత ఇదే
- Sports
బిగ్‌బాస్ విన్నర్ అభిజీత్‌కు రోహిత్ శర్మ గిఫ్ట్!
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : అన్ని చింతలు మరిచిపోయి, ఈరోజు పూర్తిస్థాయిలో ఆస్వాదించాలి...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీ కోరిక తీరబోతుంది.. మేము త్వరలోనే కలుస్తున్నాం: సుధీర్‌తో రిలేషన్‌పై రష్మీ కీలక వ్యాఖ్యలు
తెలుగు బుల్లితెర చరిత్రలో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న వారిలో జబర్ధస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ ఒకడు. అలాగే, తనదైన అందంతో కట్టిపడేస్తూ హాట్ యాంకర్‌గా వెలుగొందుతోన్న వారిలో రష్మీ గౌతమ్ పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇలా తమకు తామే సాటి అని నిరూపించుకుంటూ దూసుకెళ్తున్న ఈ ఇద్దరు టెలివిజన్ సెలెబ్రిటీల మధ్య ఏదో నడుస్తుందని చాలా కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సుధీర్‌తో రిలేషన్‌పై రష్మీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె ఏమంది.? వివరాల్లోకి వెళ్తే..

వీళ్లిద్దరూ అలా ఫేమస్ అయిపోయారు
జబర్ధస్త్ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది రష్మీ గౌతమ్. అదే షోలో ఓ టీమ్‌ను లీడ్ చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లుగానే ఏదో ఒక సమయంలో ఈ ఇద్దరూ రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. దీంతో రష్మీ - సుధీర్‌ను యూట్యూబ్ జోడీ అని పిలుస్తుంటారు. దీనికి కారణం వాళ్లిద్దరిపై అక్కడ వచ్చిన స్టోరీలే.

ఇద్దరే కాదు.. వాళ్లంతా క్లారిటీ ఇచ్చేశారు
రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, చాలా సమయాల్లో దీనికి సంబంధించిన ప్రశ్నలను కూడా ఈ ఇద్దరూ ఎదుర్కొన్నారు. దీంతో వీళ్లు పలుమార్లు క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ ఇద్దరితో పాటు వాళ్లకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకునే వాళ్లు కూడా రష్మీ - సుధీర్ మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇచ్చేశారు.

వాళ్లు కూడా బాగా క్యాష్ చేసుకుంటున్నారు
సుధీర్ - రష్మీకి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని చాలా మంది మేకర్స్ పలు రకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఇద్దరికీ వివాహం అయినట్లు చూపించారు. దానికి భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ రావడంతో... అలాంటివే చాలా షోలు చేసి క్యాష్ చేసుకున్నారు. అంతేకాదు, జబర్ధస్త్‌లోనూ ప్రత్యేకమైన ఎపిసోడ్స్ క్రియేట్ చేస్తున్నారు.

రష్మీ లేకపోతే.. నేను లేనన్న సుధీర్
కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ షోలో సుధీర్.. రష్మీ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ‘నిజానికి సుడిగాలి సుధీర్ ఫేమస్ అయ్యాడంటే దానికి కారణం రష్మీనే. అసలు ఆ అమ్మాయి లేకపోతే నేననే వాడిని ఎవరికీ తెలియదు. నా కెరీర్‌పై ఆమె ప్రభావం చాలా ఉంది' అని సుధీర్ చెప్పుకొచ్చాడు. అప్పుడే కాదు.. చాలా కార్యక్రమాల్లో ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు.

సుధీర్‌తో రిలేషన్‌పై రష్మీ కీలక వ్యాఖ్యలు
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రష్మీ.. సుధీర్‌తో సినిమా చేసే విషయంపై మాట్లాడింది. ‘నేను, సుధీర్ సినిమా చేయాలని చాలా మంది కోరుతున్నారు. మా ఇద్దరి మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. కాబట్టి చక్కని స్క్రిప్ట్ కోసం చూస్తున్నాం. అన్ని కుదిరితే త్వరలోనే మేము కలుస్తాం. ఒత్తిడి వల్ల ఏది పడితే అది చేస్తే మా రిలేషన్ దెబ్బతింటుంది' అని ఆమె చెప్పుకొచ్చింది.

వాళ్ల ముగ్గురికీ బెస్ట్ విసెష్ చెప్పేసింది
ఇదే ఇంటర్వ్యూలో రష్మీ.. తన స్నేహితులకు బెస్ట్ విసెష్ చెప్పింది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘త్రీ మంకీస్'. జీ అనిల్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జీ నగేష్ నిర్మించారు. కారుణ్య చౌదరి కథానాయిక. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగానే రష్మీ.. సుధీర్‌పై కామెంట్స్ చేసింది.