సుడిగాలి సుధీర్‌తో పెళ్లిపై రష్మీ షాకింగ్ కామెంట్స్: కోరుకునేది నిజమేనంటూ.. చెప్పకనే చెప్పేసిందిగా!

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అవుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు జబర్ధస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. కమెడియన్ సుడిగాలి సుధీర్. ప్రముఖ షో ద్వారా కలిసిన వీళ్లిద్దరూ.. చాలా కాలంగా హల్‌చల్ చేస్తున్నారు. ఇద్దరూ తమ తమ రంగాల్లో సత్తా చాటుతున్నప్పటికీ.. జంటగానే ఎంతో ఫేమస్ అయ్యారు. దీంతో వీళ్లు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుధీర్‌తో తన పెళ్లి గురించి రష్మీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Anchor Rashmi Gautam Tested Coronavirus Positivie
జబర్ధస్త్ వల్ల ఎంతో మంది ఇలా బయటకు

జబర్ధస్త్ వల్ల ఎంతో మంది ఇలా బయటకు

తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి. అందులో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ పేరును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి కారణం ఈ షో.. దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రేక్షకాదరణను అందుకుంటుండమే. అంతేకాదు, ఈ షో వల్ల ఎంతో మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మరికొందరు ఊహించని రీతిలో పాపులర్ అయ్యారు.

వాళ్లిద్దరి వల్లే షోకు ఆదరణ ఎక్కువైందిగా

వాళ్లిద్దరి వల్లే షోకు ఆదరణ ఎక్కువైందిగా

జబర్ధస్త్ షో ద్వారానే తమ కెరీర్‌లలో మొదటి బ్రేక్‌ను అందుకున్నారు యాంకర్ రష్మీ.. కమెడియన్ సుడిగాలి సుధీర్. ఆ షో వల్ల ఎంతో మంది తమ టాలెంట్‌ను ప్రపంచానికి తెలియజేశారు. తద్వారా సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ జంట మాత్రం జబర్ధస్త్‌కే ప్లస్ అయింది. వీళ్లిద్దరూ ఆన్‌ స్క్రీన్‌పై పండించే ప్రతి దాని వల్ల షో రేటింగ్ పెరుగుతోంది.

 యూట్యూబ్ జోడీ.. ప్రేమాయణం.. వివాహం

యూట్యూబ్ జోడీ.. ప్రేమాయణం.. వివాహం

జబర్ధస్త్‌తో పాటు 'ఢీ' డ్యాన్స్ రియాలిటీ షోలో తరచూ రొమాన్స్ చేస్తూ.. హాట్ టాపిక్ అవుతున్నారు రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్. షోలలో రొమాన్స్ చేయడం.. ప్రపోజ్ చేసుకోవడం.. డ్యాన్స్ చేయడం వంటి వాటి కారణంగానే ఈ జంట యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

క్యాష్ చేసుకుంటోన్నారు.. రియల్‌గా ఇలా

క్యాష్ చేసుకుంటోన్నారు.. రియల్‌గా ఇలా

యాంకర్‌గా రష్మీ గౌతమ్ తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతుండగా.. సుడిగాలి సుధీర్ మాత్రం కమెడియన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. విడివిడిగా పాపులర్ అయినప్పటికీ.. జంటగా మరింత ఫేమస్ అయిందీ యూట్యూబ్ జోడీ. దీంతో వీళ్లిద్దరి క్రేజ్‌ను క్యాష్ చేసుకోడానికి షోల నిర్వహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ జోడీతో హాట్ టాపిక్ అవుతోంది.

సుధీర్‌తో వివాహంపై యాంకర్ రష్మీ క్లారిటీ

సుధీర్‌తో వివాహంపై యాంకర్ రష్మీ క్లారిటీ

రష్మీ గౌతమ్ ఏదైనా ఈవెంట్‌కు వెళితే సుడిగాలి సుధీర్ గురించి ప్రశ్నలు వేస్తుంటారు. అలాగే, అతడికీ ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ యాంకర్ ఓ కార్యక్రమానికి హాజరైంది. ఆ తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో సుధీర్‌తో పెళ్లి గురించి ఆమెకు ప్రశ్న ఎదురైంది. 'మా పెళ్లిని జనాలు కోరుకుంటున్నారు. అది నాక్కూడా తెలుసు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

చెప్పకనే చెప్పేసింది.. అసలు మేటర్ ఏంటి?

చెప్పకనే చెప్పేసింది.. అసలు మేటర్ ఏంటి?

ఈ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడుతూ.. 'నాకు ఇప్పుడు పెళ్లి కంటే చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. కెరీర్ పరంగా స్థిరపడాలి. సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్ అవ్వాలి. ముందుగా నా ఫ్యూచర్‌పై ఓ పైప్ లైన్ వేసుకోవాలి. అప్పటి వరకూ చేసుకోను' అని చెప్పుకొచ్చింది రష్మీ. అయితే, సుడిగాలి సుధీర్‌ను మాత్రం పెళ్లి చేసుకోనని మాత్రం చెప్పకపోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X