twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దారుణమైన వీడియో.. ఆవు చర్మంతో కూడా చేసి ఉండొచ్చు.. రష్మీ సెన్సేషనల్ కామెంట్స్

    |

    జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెరపై సందడడి చేసే రష్మీలో తెలియని కోణాలెన్నో ఉన్నాయి. వెండితెరపై అందాలను ఆరబోసే రష్మీకి.. అంతకంటే అందమైన మనసు ఉంది. మూగజీవాల కోసం రష్మీ పడే తపన చూస్తే ఆ విషయం ఎవ్వరికైనా అర్థమవుతుంది. కరోనా లాంటి విపత్కర కాలంలో మూగజీవాల కోసం ఆలోచించడం, వాటి ఆకలిని తీర్చేందుకు రష్మీ పడిన శ్రమ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తాజాగా రష్మీ కంటపడ్డ ఓ దారుణమైన వీడియోపై స్పందించింది. రష్మీ చెప్పిన విషయాలు, సలహాలు ఆలోచనలు రేకెత్తించేలానే ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

    కుక్కలను కొడుతున్నవీడియో..

    కుక్కలను దారుణంగా కొడుతున్న ఓ వీడియోను ఓ నెటిజన్ రష్మీకి షేర్ చేశాడు. అందులో కొందరు వ్యక్తులు కుక్కలను దారుణంగా చంపుతున్నారు. వాటి చర్మాన్ని ఒలుస్తున్నారు. కుక్క చర్మంతో తయారు చేసినవి కూడా ఉండొచ్చు లెదర్‌‌వి వాడకండని చెబుతూ ఆ వీడియో ముగుస్తుంది.

    నేను వాటిని తినను..

    కుక్కలను చంపుతూ వాటిని చర్మం ద్వారా తయారు చేస్తున్నట్టు చూపిన వీడియోపై రష్మీ స్పందిస్తూ.. ‘అవును.. ఈ అనారిక చర్యల గురించి నాకు తెలుసు.. అందుకే నేను పాల పదార్థాలతో కూడుకున్న వస్తువులేవీ తినను.. అంతేకాకుంగా లెదర్‌తో చేసినవేవీ కూడా ధరించను.. మా అమ్మ కూడా నాకు అదే నేర్పింది..

    ఆవు చర్మంతో కూడా..

    ఇలాంటి అనాగరిక చర్యలు మనదేశంలోనూ జరుగుతూ ఉంటాయి. మన డెయిరీ సంస్థలు వీటికి ఏ మాత్రం తీసిపోవు.. మనం ఆవులను పూజిస్తాము.. పాల కోసం పెంచుకుంటాం.. అంతా అయిపోయాక కసాయి వాడికి ఇచ్చేస్తాం. మనం ఆవు చర్మంతో తయారుచేసనవి కూడా ధరించే ఉంటామ'ని తెలిపింది

    వాటికి వ్యతిరేకం..

    ఈ మేరకు ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు స్పందిస్తూ.. ‘ఇలా చెబుతున్నందుకు క్షమించండి..మనం ఒకవేళ పాలను కొంటున్నామంటే.. మనం కూడా వారిలానే క్రూయల్. పాలను వాడటానికి నేను వ్యతిరేకం కాదు.. ఆ నెపంతో వాటిని ట్రీట్ చేసే విధానానికి వ్యతిరేకమ'ని తెలిపింది.

    Recommended Video

    Case Filed Against Anchor Srimukhi | Filmibeat Telugu
    వాటిని మానేయాలి..

    వాటిని మానేయాలి..

    మరో నెటిజన్ ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఇదంతా డిమాండ్ అండ్ సప్లయ్ మీద ఆధారపడి ఉంటుంది..మనం పాలను వాడటం మానేయాలి.. ఎక్కువ జనాబా ఉంటే ఎక్కువ పాలు కావాలి.. దీని కోసం వారు ఆవులను యాంటి బయాటిక్స్ ఎక్కిస్తారు.. అంతా ఆర్టిఫిషియల్‌గా తయారు చేస్తార'ని పేర్కొంది.

    English summary
    Rashmi Gautam Comments On Cows And Dogs slaughterhouse. I'm sorry to say this but if u r consuming milk out of the packets then u r also part of cruelty
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X