ఉచిత రేషన్ అడుగుతారు.. మద్యానికి డబ్బులు ఎలా వస్తాయ్.. జబర్దస్త్ యాంకర్ రష్మీ ఫైర్
జబర్దస్త్ యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై సందడడి చేసే రష్మీలో సామాజిక కోణం ఉంది. మూగజీవాల పట్ల, సమాజంలో జరిగే అన్యాయల పట్ల స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో నెటిజన్లలో వాగ్వాదానికి దిగుతుంది. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతూ ఉంటుంది. తాజాగా రష్మీ మందుబాబులపై ఫైర్ అయింది. ప్రభుత్వం మద్యం విక్రయానికి అనుమతినివ్వడంతో.. మందుబాబులు ఎంతగా రెచ్చిపోతోన్నారో అందరికీ తెలిసిందే. వీటిపై రష్మీ కాస్త ఘాటుగానే స్పందించింది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.
మందుబాబులపై ఫైర్..
మద్యం కోసం బయటకు వచ్చే ప్రతీ ఒక్కరిపై స్టాంప్ వేయాలని, అలాంటి వారికి ఎవ్వరూ సాయం చేయోద్దని, ప్రభుత్వం నుంచి అందే ఏ సాయం కూడా అతనికి చేరొద్దని తెలిపింది. కనీసం అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు ఉండవు కానీ మందు తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయ్ అంటూ ఫైర్ అయింది.
మద్యం కొనడానికి మాత్రం డబ్బులు..
ఈ మేరకు స్పందిస్తూ.. ఇలాంటివన్నీ చూస్తే ఆశ్యర్యం కలుగుతుంది.. ఇలాంటి వారు పేదవారా? ఉచిత రేషన్ కోసం అడుగుతారు కానీ మద్యం కొనడానికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయ్ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు స్పందించిన ఓ నెటిజన్.. అడగటానికి మీకసలు ఎలాంటి హక్కులేదని, ఒక్కరికి కూడా విరాళం ఇవ్వలేదని ఫైర్ అయ్యాడు.
మందు షాపుల వద్ద లైన్లో..
సదరు నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘నా షూట్స్ ఆగిపోయినా న వద్ద డబ్బు ఉంది.. మీ పని మీరు చేసుకోండి.. నేను విరాళం ఇచ్చాను.. వివిధ మార్గాల ద్వారా ఫండ్‌ను సేకరించాను.. అయితే అవసరమున్న వారు మాత్రం మంద షాపుల వద్ద లైన్లో నిలబడొచ్చు' అంటూ ట్వీట్ చేసింది.
Recommended Video

జనాలు వాటి కోసం ఎదురుచూస్తున్నారు..
‘మందు షాపులు ఒపెన్ చేయడం కాదు.. ప్రజలంతా వారింట్లో పని మనుషుల కోసం ఎదురుచూస్తున్నారు. వయోవృద్దులకు పని మనుషులు సరైనదే అయినా.. అన్ని సక్రమంగా ఉన్నవారు తమ ఇంటి పనులను ఇంకొన్ని వారాలు చేసుకోలేరా? అంటూ రష్మీ ప్రశ్నించింది.


Click it and Unblock the Notifications











