ముందు మనుషులకు సాయం చెయ్.. రష్మీకి నెటిజన్ సూచన.. యాంకర్ జబర్దస్త్ రిప్లై
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ 19 దెబ్బకు అగ్రరాజ్యం కూడా కుదేలైపోతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది కరోనా బారిన పడగా.. లక్షకు పైగా ప్రాణాలను కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది అమెరికాకు చెందిన వారే. ప్రస్తుతం అన్ని దేశాల కంటే అమెరికానే పెను ప్రమాదంలో ఉంది. మన దేశంలోనూ కరోనా వైరస్ శర వేగంగా విస్తరిస్తోంది.

11 వేలకు చేరిన కేసులు..
భారతదేశంలోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ పరిస్థితి విషమంగా మారుతోంది. ఇప్పటికే కరోనా బారిన పడ్డవారి సంఖ్య 11 వేలకు చేరుకోగా.. దాదాపు 400 మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి ఇలా భయంకరంగా ఉంటే ఈ నేపథ్యంలో ఫేక్ న్యూస్ కూడా తెగ హల్చల్ చేస్తున్నాయి.

మూగజీవాల ద్వారా కరోనా..
మూగజీవాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందన్న ఫేక్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీంతో చాలా మంది పెంపుడు జంతువులను వదిలేస్తున్నారు, నడిరోడ్డుపైనే విడిచేసి వెళ్లిపోతున్నారు. దీంతో అవి దిక్కులేక, తినడానికి తిండిలేక అలమటిస్తున్నాయి. అలాంటి వాటిని కాపాడేందుకు జబర్దస్త్ యాంకర్ రష్మీ రంగంలోకి దిగింది.
స్వయంగా రోడ్లపైకి..
మూగ జీవాలకు తిండి దొరకడం లేదని గ్రహించిన రష్మీ స్వయంగా రోడ్లపైకి ఎక్కింది. చేతిలో బకెట్ పట్టుకుని వీధి కుక్కలకు ఆహారాన్ని పెట్టసాగింది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. రష్మీ చేస్తోన్న మంచి పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపించారు.

ముందు మనుషులకు సాయం చెయ్..
అయితే రష్మీ మూగ జీవాల పట్ల చూపిస్తున్న ప్రేమ, చేస్తోన్న సేవలపై ఓ నెటిజన్ మాత్రం భిన్నంగా స్పందించాడు.ముందు వెళ్లి ఆపదలో ఉన్న మనుషులను ఆదుకో..మనుషులు బాగుంటే జంతువులను బాగా చూసుకోవచ్చని చురకలంటించాడు. ఈ కామెంట్‌కు స్పందించిన రష్మీ.. అది నువ్ చెయ్ అంటూ కౌంటర్ వేసింది.


Click it and Unblock the Notifications











