For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుధీర్ పెద్ద దిండుగాడు.. తవ్వి తవ్వి వచ్చేశాడు.. బాగా ముదిరిపోయింది: రష్మీ సంచలన వ్యాఖ్యలు

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలాంటి వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాటు ఎనలేని పాపులారిటిని సొంతం చేసుకున్నారు. అందులో జబర్ధస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఆ భామ దాదాపు ఆరేడేళ్లుగా బుల్లితెరపై తన హవాను చూపిస్తోంది. ఎప్పుడూ కామ్‌గా ఉండే హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ తాజాగా రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ సంగతులు మీకోసం!

  వేరు వేరు వృత్తి... కానీ అలా కలిశారు

  వేరు వేరు వృత్తి... కానీ అలా కలిశారు

  సినిమాల్లో నటించాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది రష్మీ గౌతమ్. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లుగా పలు సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ షోతో యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అప్పటి నుంచి సత్తా చాటుతోంది. ఇదే షోతో వెలుగులోకి వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యాడు సుడిగాలి సుధీర్. అలా వీళ్లిద్దరూ కలిసిపోయారు.

  ప్రేమాయణం.. పెళ్లి కూడా అని ప్రచారం

  ప్రేమాయణం.. పెళ్లి కూడా అని ప్రచారం

  జబర్ధస్త్‌కు యాంకర్‌గా చేస్తున్న రష్మీ గౌతమ్‌పై ఆరంభంలోనే సుడిగాలి సుధీర్ తరచూ ఏదో ఒక కామెంట్లు చేస్తూ ఉండేవాడు. దీంతో అతడు ఆమెపై మనసు పారేసుకున్నాడని అనుకున్నారు. అదే సమయంలో ఆమె కూడా అలాగే రెస్పాండ్ అవుతుండడంతో ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుుతుందన్న టాక్ వినిపించింది. దీంతో ఈ జంట పెళ్లి పీటలు కూడా ఎక్కబోతుందని అంటున్నారు.

  టీఆర్పీ కోసం వాళ్లు ఇలా... రెచ్చిపోయి

  టీఆర్పీ కోసం వాళ్లు ఇలా... రెచ్చిపోయి

  రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే అవి ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. దీనికి కారణం వీళ్లిద్దరూ రొమాన్స్ చేస్తుండడమే. అసలు వీళ్లిలా ఫేమస్ అవడానికి షో నిర్వహకులు పెడుతోన్న రొమాంటిక్ స్కిట్‌లే కారణమని చెప్పొచ్చు. ఇలా పెళ్లి చేసుకోవడం వల్లో.. హగ్గులు ఇచ్చుకోవడం వల్లో వీళ్లకు ప్రేమ జంటగా పేరొచ్చింది.

   ఇద్దరికీ క్లారిటీ... కానీ అతడి మాటలతో

  ఇద్దరికీ క్లారిటీ... కానీ అతడి మాటలతో

  దాదాపు ఐదారేళ్లుగా రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ ప్రేమాయణం గురించి వార్తలు వస్తుండగా.. వాళ్లిద్దరూ దాని గురించి స్పందిస్తూనే ఉన్నారు. తద్వారా తమ మధ్య ఏ బంధం ఉందో క్లారిటీ ఇస్తున్నారు. రష్మీ గౌతమ్ తామిద్దరం స్నేహితులమని వెల్లడిస్తుండగా.. సుధీర్ మాత్రం భిన్నంగా చెబుతున్నాడు. ఆమె లేకపోతే తాను లేనని ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతూ వస్తున్నాడు.

  ఒకరిపై ఒకరు పంచులు.. ట్రెండింగ్ జోడీ

  ఒకరిపై ఒకరు పంచులు.. ట్రెండింగ్ జోడీ

  రొమాంటిక్ యాక్ట్‌లు చేసుకుంటోన్న సమయంలోనే రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ, మామూలు సమయంలో మాత్రం వీళ్లిద్దరూ ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని హాట్ కామెంట్స్ చేస్తుండగా.. కొన్ని సార్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. మొత్తానికి అన్ని రకాలుగా కనిపిస్తూ ట్రెండ్ అవుతున్నారు.

   సుధీర్‌పై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

  సుధీర్‌పై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

  సుడిగాలి సుధీర్ స్కిట్లు చేస్తోన్న సమయంలో యాంకర్ చైర్‌లో కూర్చున్న రష్మీ గౌతమ్ తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటోంది. అయితే, ఈ మధ్య జోరు పెంచిన ఆమె.. వాటిని మరింత ఎక్కువ చేసేసింది. ఈ క్రమంలోనే తరచూ అతడిని టార్గెట్ చేస్తూ పంచులు పేల్చుతోంది. ఇందులో భాగంగానే తాజాగా సుధీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రోమో తాజాగా విడుదలైంది.

  Mahesh Babu Enroute Dubai | Sarkaru Vaari Paata 2nd Schedule | Filmibeat Telugu

  దిండుగాడు.. తవ్వి తవ్వి వచ్చేశాడంటూ

  వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో రష్మీ గౌతమ్.. పదే పదే సుడిగాలి సుధీర్‌పై డబుల్ మీనింగ్ డైలాగులతో కామెంట్లు చేసింది. రోజా అతడిని సొరంగాల సుధీర్ అనగా.. వెంటనే అందుకున్న రష్మీ ‘తవ్వీ తవ్వీ వచ్చేశాడు' అంది. ఆ తర్వాత ‘ముదిరిపోయిన బెండకాయ'.. ‘సుధీర్ పెద్ద దిండుగాడు' అంటూ పలు రకాల కామెంట్లు చేసింది. దీంతో అంతా షాక్ అవుతున్నారు.

  English summary
  Tollywood Actress, Anchor Rashmi Gautam Doing Jabardasth Show. Now In This Show She Use Double Meaning Dialogues for Sudigali Sudheer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X